Best Gaming Phones 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ.20వేల లోపు ధరలో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
Best Gaming Phones 2024 : పోకో ఎక్స్6 ప్రో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో కలిగి ఉంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో వస్తుంది. అక్టోబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలుకు బెస్ట్ గేమింగ్ ఫోన్‌లు ఉన్నాయి.

Best Gaming Phones to buy under Rs 20k in October 2024
Best Gaming Phones 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొనుగోలుదారులు రూ. 20వేల ధరలో అనేక స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. గేమింగ్ ఔత్సాహికులకు పోకో ఎక్స్6 ప్రో, ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో వంటి గేమింగ్ ఫోన్ల నుంచి లావా అగ్ని 3, ఐక్యూ జెడ్9 వంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి. అక్టోబర్ 2024లో రూ. 20వేల లోపు కొనుగోలుకు బెస్ట్ గేమింగ్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1) పోకో ఎక్స్6 ప్రో :
పోకో ఎక్స్6ప్రో ఫోన్ 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999, అన్ని బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 19,999కి చేరుకుంది. పోకో ఎక్స్6 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్ఓసీతో పాటు మాలి-జీ615 జీపీయూతో రన్ అవుతుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పోకో ఎక్స్6 ప్రో 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని కలిగి ఉంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. షావోమీ హైపర్ఓఎస్ ఓవర్‌లేతో సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌లో పనిచేస్తుంది. ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్‌తో వస్తుంది.
2) ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో :
ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లేను 1300నిట్స్ గరిష్ట ప్రకాశం, 144Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌సెట్‌తో వస్తుంది. గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ మాలి జీ610-ఎమ్‌సీ6 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన గేమింగ్ డిస్‌ప్లే చిప్‌ను కలిగి ఉంది. పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో, జీపీయూ పర్ఫార్మెన్స్ రిజల్యూషన్‌ను మెరుగుపరుస్తుంది.
45డబ్ల్యూ అడాప్టర్‌తో స్పీడ్ ఛార్జింగ్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారంగా ఇన్ఫినిక్స్ ఎక్స్ఓఎస్ 14తో రన్ అవుతోంది. ఇన్ఫినిక్స్ జీటీ 20ప్రో ధర రూ. 22,999 ఉండగా, వెబ్‌సైట్‌లో అదనంగా రూ. 1,000 తగ్గింపు అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 21,999 కి తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో ఫోన్‌ను రూ. 18,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
3) లవ అగ్ని 3 :
లావా అగ్ని 3 ఫోన్ 1,200×2,652 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 1,200 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశం స్థాయిలను కూడా అందిస్తుంది. హుడ్ కింద అగ్ని 3 మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్‌తో 4ఎన్ఎమ్ ప్రాసెస్‌తో వస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అదనపు 8జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్టు అందిస్తుంది. వినియోగదారులకు అదనపు పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్టోరేజీ విస్తరణకు సపోర్టు లేనప్పటికీ, గరిష్టంగా 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో ఆప్షన్లు ఉన్నాయి.
4) ఐక్యూ జెడ్9 :
ఐక్యూ జెడ్9 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అయితే, ఫ్రంట్ సైడ్ షార్ప్ సెల్ఫీలకు 16ఎంపీ కెమెరా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో యాప్‌లు, మీడియాకు తగినంత స్టోరేజీని అందిస్తుంది. 5000mAh బ్యాటరీ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వి14లో రన్ అవుతుంది. డ్యూయల్ 5జీ సిమ్ కార్డ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.
5) వివో టీ3 :
వివో టీ3 5జీ ఫోన్ 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డ+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డీఆర్ 10+ సర్టిఫికేషన్, గరిష్టంగా 1800 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. వివో మిడ్-రేంజర్ 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అన్ని గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు మాలి జీ610 ఎమ్‌సీ4 జీపీయూతో వస్తుంది. వివో టీ3 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు.