Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
Best Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 15వేల లోపు ధరలో 5 టాప్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేందుకు ఓసారి లుక్కేయండి.
![Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..! Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!](https://10tv.in/wp-content/uploads/2023/11/Best-smartphones-under-Rs.15K-this-November-2023.jpg)
Best smartphones under Rs.15K this November 2023
Best Smartphones 2023 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పండుగ సీజన్ ముగిసినప్పటికీ.. అమెజాన్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు ఇంతకు ముందు డీల్ ఉపయోగించుకోకపోతే, బెస్ట్ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, కనీసం 6జీబీ ర్యామ్‌ను అందించే రూ.15వేల లోపు ధర కలిగిన సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ ధర పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని టాప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
లావా బ్లేజ్ ప్రో 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
ఈ ఫోన్ లావా బ్లేజ్ ప్రో 5జీ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.12,999కి రిటైల్ అవుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఆర్ఓఎమ్ (16జీబీ వరకు విస్తరింపు) శక్తివంతమైన 2.2జీహెచ్‌జెడ్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 17.22సెం.మీ (6.78) 120హెచ్‌జెడ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంది.
![Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..! Best smartphones under Rs.15K this November 2023](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/11/Best-smartphones-under-Rs.15K-this-November-2023-1.jpg)
Lava Blaze Pro 5G
విడివైన్ ఎల్1 డీఆర్ఎమ్ ప్రొటెక్షన్‌తో హై-రిజల్యూషన్ కంటెంట్‌ని అందిస్తోంది. ఈ పరికరంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50ఎంపీ ఏఐ కెమెరా, 2కె వీడియోకు సపోర్ట్ చేసే 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈఎఐఎస్తో రికార్డింగ్ కలిగి ఉంది. అదనంగా, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఐక్యూ జెడ్6 లైట్ 5జీ (6జీబీ ర్యామ్, 128జీబీ రోమ్)
ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 12,999 వద్ద లభిస్తుంది. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ 6ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేలో గేమింగ్‌ను మెరుగుపరచడానికి 120హెచ్‌జెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో ఆధారితమైనది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.
![Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..! Best smartphones under Rs.15K this November 2023](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/11/Best-smartphones-under-Rs.15K-this-November-2023-2.jpg)
iQOO Z6 Lite 5G
రెడ్మి 12 5జీ (6జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
రూ.13,499 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంది. రెడ్మి 12 5జీ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంది. ఎంఐయూఐ 14తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 50ఎంపీ హెడ్డ్ డ్యూయల్ కెమెరా సెటప్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 17.24సెం.మీ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. బాక్స్‌లో 22.5డబ్ల్యూ ఛార్జర్‌తో 5000ఎంఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.
![Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..! Best smartphones under Rs.15K this November 2023](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/11/Best-smartphones-under-Rs.15K-this-November-2023-3.jpg)
Tecno Pova 5 Pro 5G
ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
ఇన్పినిక్స్ హాట్ 30 5జీ ధర ప్రస్తుతం రూ. 13,500కు సొంతం చేసుకోవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్తో విస్తారమైన స్టోరేజీని అందిస్తుంది. 6000ఎంఎహెచ్ బ్యాటరీ ఛార్జింగ్‌తో వస్తుంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు ఫోటోగ్రఫీకి 50ఎంపీ ఏఐ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
![Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..! Best smartphones under Rs.15K this November 2023](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/11/Best-smartphones-under-Rs.15K-this-November-2023-4.jpg)
Infinix HOT 30 5G
టెక్నో పోవా 5 ప్రో 5జీ (8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్) :
టెక్నో పోవా 5 ప్రో 5జీ ధర రూ. 14,999కు పొందవచ్చు. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ (మెమొరీ ఫ్యూజన్‌తో 16జీబీకి విస్తరించింది). 120హెచ్‌జెడ్ 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, 50ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.
![Best Smartphones 2023 : ఈ నవంబర్‌లో రూ.15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..! Best smartphones under Rs.15K this November 2023](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/11/Best-smartphones-under-Rs.15K-this-November-2023-5.jpg)
Redmi 12 5G