BSNL Prepaid Plan Offer : BSNL యూజర్లకు దిమ్మతిరిగే ఆఫర్.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. 30 రోజులు అదనపు వ్యాలిడిటీ..!
BSNL Prepaid Plan Offer : BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది.

BSNL is offering 30 days additional validity with this plan
BSNL Prepaid Plan Offer : ప్రముఖ దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. (TelecomTalk) నివేదిక ప్రకారం.. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు తక్కువ ధరలో అదనపు వ్యాలిడిటీని అందించడం లేదు.
గతంలో BSNL ప్రీపెయిడ్ రూ.397 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 150 రోజుల వ్యాలిడిటీ అందించేది. ఈ స్పెషల్ ప్రమోషనల్ ఆఫర్ ద్వారా మరో 30 రోజులు అదనంగా వ్యాలిడిటీని అందిస్తోంది. అంటే.. 180 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. రూ.397తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా డేటా, కాలింగ్ బెనిఫిట్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని గమనించాలి.
రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ (BSNL) గత ఆగస్టు 15, 2023 అదనపు వ్యాలిడిటీ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. BSNL రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్ కొనుగోలుపై అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (STD, లోకల్)తో బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా ప్లాన్ 2GB అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. వినియోగదారులు 40kbps లో స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల పాటు రోజుకు 100SMSతో వస్తుంది. ముఖ్యంగా, ఈ ప్లాన్ ప్రామాణిక 150 రోజుల వ్యాలిడిటీ ఉన్నప్పటికీ.. ప్లాన్ అందించే అన్ని బెనిఫిట్స్ 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.

BSNL Prepaid Plan Offer : BSNL is offering 30 days additional validity with this plan
ప్రమోషనల్ ఆఫర్ :
30 రోజుల అదనపు వ్యాలిడిటీ కూడా ప్రస్తుతం ఈ ప్లాన్‌లో భాగమే. ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీని 180 రోజులుగా అందిస్తుంది. నివేదిక ప్రకారం.. ప్రమోషనల్ ఆఫర్ లిమిటెడ్ కాల వ్యవధి వరకు వ్యాలిడిటీ అందిస్తుంది. ఆగస్ట్ 15, సెప్టెంబరు 13 మధ్య రీఛార్జ్ చేసిన తర్వాత బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.
ఏ ప్రాంతంలో ప్లాన్ ఉందంటే? :
రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 30 రోజుల అదనపు వ్యాలిడిటీ భారత్‌లోని అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో BSNL ప్లాన్ అందుబాటులో ఉండకపోవచ్చు.
BSNL ప్రీపెయిడ్ ఇతర ప్లాన్‌లు :
రూ.397 ప్లాన్ మాదిరిగానే మరో ప్లాన్ రూ.349 ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ MTNL నెట్‌వర్క్‌తో సహా అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ 4G స్పీడ్‌తో రోజుకు 2GB డేటాతో వస్తుంది. వినియోగదారులు 40kbps తగ్గిన వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లలో అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ కూడా అందిస్తుంది.