ChatGPT App : ఆపిల్ ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్ ఆగయా.. ఇక ఆండ్రాయిడ్‌లో ఎప్పుడంటే..?
ChatGPT App : ఇప్పటివరకు, (ChatGPT) స్మార్ట్‌ఫోన్‌లలో Chrome బ్రౌజర్ లేదా Safari వంటి బ్రౌజర్ ద్వారా మాత్రమే యాక్సస్ చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు, ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా చాట్‌జీపీటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ChatGPT app now available on iPhones, Android users to get it later
ChatGPT App : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీపైనే ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి OpenAI ద్వారా (ChatGPT) ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ (Bing AI), గూగుల్ బార్డ్ ఏఐ (Google Bard AI) పోటీగా అనేక ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటివరకూ ఈ ఏఐ టూల్స్ వెబ్ బ్రౌజర్ మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది. మొబైల్ డివైజ్ లేదా డెస్క్‌టాప్ డివైజ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, చివరకు చాట్‌జీపీటీ (ChatGPT App) యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. అది కేవలం (iPhone) యూజర్లకు మాత్రమే. అమెరికాలోని ఐఫోన్ యూజర్లకు మొదటగా చాట్‌జీపీటీ యాక్సెస్ లభిస్తుందని ఒక బ్లాగ్ పోస్టు తెలిపింది. ఆ తర్వాత భారత్ సహా ఇతర దేశాల్లో త్వరలో యాక్సెస్ పొందుతాయని కంపెనీ పేర్కొంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా త్వరలో చాట్ జీపీటీ యాక్సెస్ లభిస్తుందని నివేదిక తెలిపింది. iOS యూజర్ల కోసం ChatGPT యాప్ వాయిస్ ఇన్‌పుట్‌లను కూడా అనుమతిస్తుంది. ఈ కొత్త ఏఐ యాప్ ఓపెన్ సోర్స్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ విస్పర్ సహకారంతో రూపొందించారు. ChatGPT ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు తమ ఐఫోన్ల నుంచి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ప్లస్ సభ్యత్వం కలిగిన యూజర్లు స్పీడ్ రెస్పాండ్స్, ప్లగ్-ఇన్‌లు, వెయిటింగ్ టైమ్ కూడా నిర్ధారిస్తుంది. ఇప్పుడు, ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం చాట్‌జీపీటీ కొత్త యాప్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తోంది రివీల్ చేయలేదు. ఈ యాప్ వచ్చిన తర్వాత వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అమెరికాలో ముందుగా చాట్‌జీపీటీ యాప్ :
అమెరికాలో చాట్‌జీపీటీని లాంచ్ చేస్తున్నామని (OpenAI) నివేదిక తెలిపింది. రాబోయే కొన్ని వారాల్లో మరిన్ని దేశాలకు విస్తరిస్తామని పేర్కొంది. చాట్ జీపీటీ వినియోగంపై యూజర్ల అభిప్రాయాన్ని సేకరించనున్నట్టు తెలిపింది. ChatGPT యాక్సస్ పొందాలంటే ఫీచర్, సెక్యూరిటీ వంటి ఫీచర్లను కలిగి ఉండాలి. ChatGPT యాప్‌తో అవసరమైన టూల్స్ మార్చడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతలో, ChatGPT యాప్ స్టోర్ లిస్టింగ్, యాప్ ఇన్‌స్టంట్ సాయంతో అవసరమైన సూచనలు, క్రియేటివిటీ, ప్రొఫెషనల్ ఇన్‌పుట్ కస్టమైజడ్ ఎక్స్‌ర్ సైజులను అభ్యాసాన్ని అందజేస్తుందని చెబుతోంది.

ChatGPT app now available on iPhones, Android users to get it later
ఐఓఎస్ 16.1 లేదా ఆపై వెర్షన్‌లో..
ఈ యాప్ స్టోర్ ప్రైవసీ లేబుల్, ChatGPT కాంటాక్టు డేటాతో పాటు యూజర్ కంటెంట్, ఐడెంటిఫైయర్‌లు, వినియోగ డేటా, డయాగ్నస్టిక్‌లను ట్రాక్ చేస్తుందని తెలిపింది. ఈ యాప్‌ను యాక్సస్ చేయాలంటే iOS 16.1 లేదా ఆపై వెర్షన్ అవసరమని తేలింది. ఈ కొత్త యాప్‌తో OpenAI కనీసం ఆన్‌లైన్‌లో కనిపించిన అనేక ఫేక్ ChatGPT యాప్‌లను పరిష్కరించగలదు. కొంతమంది యాప్ డెవలపర్‌లు వినియోగదారులను ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌తో పేమెంట్ చేయాలంటూ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాయని గుర్తించారు. మరో మాటలో చెప్పాలంటే.. యూజర్లను డబ్బును దొంగిలించడానికి Fake ChatGPT యాప్‌లను క్రియేట్ చేస్తారని భద్రతా సంస్థ సోఫోస్ (Sophos) రిపోర్టు పేర్కొంది.
ChatGPT అధికారిక యాప్ కావడంతో అనేకమంది ChatGPT అభిమానులు అప్లికేషన్‌ను ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ప్రయాణంలో జనరేటివ్ AI పవర్ అందిస్తుంది. వైరల్ చాట్‌బాట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి యాప్‌లు రెండేళ్లలో చేయలేనిది పబ్లిక్ రిలీజ్ తర్వాత రెండు నెలల్లో ఇది 100 మిలియన్ల యూజర్లను పొందింది. అదేవిధంగా, ప్రైవసీ సంబంధిత సమస్యలపై తమ సర్వర్‌లలో ChatGPTని నిషేధించిన కొన్ని కంపెనీలకు ChatGPT యాప్ ఫారమ్ వేదిక కావచ్చు. ఆసక్తికరంగా, ఆపిల్ కొంతమంది ఉద్యోగుల కోసం ChatGPT, ఇతర AI టూల్స్ వినియోగాన్ని పరిమితం చేసింది.