మీ పోస్టులు ఇక అంతే : ఫేస్‌బుక్‌లో Likes కనిపించవు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై పోస్టు చేసే పోస్టులకు సంబంధించి లైక్స్ ఇక కనిపించవు.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై పోస్టు చేసే పోస్టులకు సంబంధించి లైక్స్ ఇక కనిపించవు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై పోస్టు చేసే పోస్టులకు సంబంధించి లైక్స్ ఇక కనిపించవు. అంటే.. మీ పోస్టుకు ఎన్ని లైక్స్ వచ్చాయో చూడలేరు. లైక్స్ కౌంట్ ఆప్షన్ హైడ్ కానుంది. ఈ వారమే ఫేస్‌బుక్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం లైక్స్ కౌంట్ హైడ్ చేయడంపై టెస్టింగ్ నడుస్తోంది. ఏ క్షణంలోనైనా ఫేస్‌బుక్ లైక్స్ ఆప్షన్ హైడ్ చేసే అవకాశం ఉంది. చాలామంది ఫేస్ బుక్ యూజర్లు తమ పోస్టులపై లైక్స్ కోసం తెగ షేర్ చేస్తుంటారు. పోస్టుకు లైక్స్ వస్తుంటే చూసి ఎంతో మురిసిపోతుంటారు. ఎన్ని లైక్స్ వస్తే.. అంత పాపులర్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు.
రివర్స్ ఇంజినీరింగ్ మాస్టర్ జేన్ మంచూన్ వాంగ్ ఆండ్రాయిడ్ యాప్ లో కోడ్‌ను గుర్తించారు. ఈ కోడ్ ఆధారంగా ఫేస్ బుక్ త్వరలో తమ ప్లాట్ ఫాంపై పోస్టులపై వచ్చే లైక్స్ కౌంట్ డిసేబుల్ చేయబోతుందని వాంగ్ చెప్పినట్టు టెక్ క్రంచ్ తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో లైక్స్ కౌంట్ హైడ్ చేసిన వాటిలో ఫేస్ బుక్ ఒకటి మాత్రమే కాదు.. నిజానికి ఇన్ స్టాగ్రామ్ పై కూడా హైడింగ్ లైక్స్ కౌంట్ టెస్టింగ్ జరిపింది.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇన్ స్టాగ్రామ్ యూజర్ల పోస్టులపై లైక్స్ కౌంట్ హైడ్ చేయడంపై టెస్టింగ్ చేసింది. ఇప్పుడు పబ్లిక్ నుంచి లైక్స్ డిసేబుల్ అయ్యాయి. ఇదే తరహాలో ఫేస్ బుక్ కూడా తమ ప్లాట్ ఫాంపై పోస్టుల లైక్స్ కౌంట్ హైడ్ చేయాలని నిర్ణయించుకుంది. చాలామంది ఫేస్ బుక్ యూజర్లు లైక్స్ రావడం కోసం ఫొటోలు, వీడియోలతో ఎట్రాక్టీవ్ పోస్టులు పెడుతుంటారు.
తమ పోస్టులకు ఎక్కువ లైక్స్ రావడం లేదని మానసికంగా కృంగిపోతుంటారు. ఎన్ని లైక్స్ ఎక్కువగా వస్తే అంతా హ్యాపీగా యూజర్లు ఫీల్ అవుతుంటారు. కొన్నిసార్లు లైక్స్ అనుకున్నట్టు రాకపోతే నిరూత్సాహానికి గురవుతుంటారు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఫేస్‌బుక్ భావిస్తోంది. లైక్స్ కౌంట్ ఆప్షన్ హైడ్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఫేస్ బుక్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా తమ పోస్టులకు లైక్స్ హైడ్ చేయడంపై ఫేస్ బుక్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.