మిషన్ మొదలైంది : ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు తొలగింపు
ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ వందలాది అకౌంట్లను తొలగించాయి. మాలిసియస్ (వైరస్ ఇన్ఫెక్టడ్) అకౌంట్లపై నిఘా పెట్టిన ఫేస్ బుక్, ట్విట్టర్.. ఆయా అకౌంట్ల పేజీలు, గ్రూపులను తొలగించాయి.

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ వందలాది అకౌంట్లను తొలగించాయి. మాలిసియస్ (వైరస్ ఇన్ఫెక్టడ్) అకౌంట్లపై నిఘా పెట్టిన ఫేస్ బుక్, ట్విట్టర్.. ఆయా అకౌంట్ల పేజీలు, గ్రూపులను తొలగించాయి.
శాన్ ఫ్రాన్సిస్ కో: ప్రముఖ సోషల్ నెట్ వర్క్ దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ వందలాది అకౌంట్లను తొలగించాయి. మాలిసియస్ (వైరస్ ఇన్ఫెక్టడ్) అకౌంట్లపై నిఘా పెట్టిన ఫేస్ బుక్, ట్విట్టర్.. ఆయా అకౌంట్ల పేజీలు, గ్రూపులను తొలగించాయి. ఇరాన్, రష్యా, బంగ్లాదేశ్, వెనిజూలా దేశాల్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ సంయుక్తంగా వందలాది మాలిసియస్ అకౌంట్లను గుర్తించి సోషల్ ప్లాట్ ఫాం నుంచి తొలగించాయి. ఇప్పటివరకూ 783 పేజీలు, గ్రూపులు, అకౌంట్లను తొలగించినట్టు ఓ నివేదిక తెలిపింది. ఇరాన్ నుంచి వచ్చిన సూచనల మేరకు సెక్యూరిటీ దృష్ట్యా మాలిసియస్ అకౌంట్లను గుర్తించి తొలగించినట్టు పేర్కొంది.
ఈ తరహా అకౌంట్లతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పుడుతున్నారని, ఎక్కువగా మధ్య ఆసియా, దక్షిణ ఆసియాలోని ప్రజలే లక్ష్యంగా ఈ అకౌంట్లను నడుపుతున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఫేస్ బుక్ తొలగించిన ఫేజీల్లో ఒకదానికి 2 మిలియన్ల అకౌంట్లు ఫాలోవర్లుగా ఉన్నాయని, సంబంధిత గ్రూపుల్లో 16వందల అకౌంట్లు జాయిన్ అయినట్టు గుర్తించారు. అంతేకాదు.. మాలిసియస్ ఇన్ స్టాగ్రామ్ ఒక అకౌంట్ లోనే 254వేలకుపైగా అకౌంట్లు ఫాలో అవుతున్నట్టు గుర్తించినట్టు సైబర్ సిటీ పాలసీ హెడ్ నాథన్ నైల్ గ్లెచర్ తన బ్లాగ్ పోస్టులో తెలిపారు.
రీమూవ్ చేసిన అకౌంట్లలోని పోస్టులు 2010లో చేసినట్టుగా ఉన్నాయని, ఈ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లపై యాడ్స్ కోసం 30వేల డాలర్లు ఖర్చు పెట్టినట్టు గుర్తించామన్నారు. తొలుత యూఎస్ డాలర్లలో, ఆ తరువాత వరుసగా యూకే పౌండ్స్, కెనడియన్ డాలర్లు, యూరోలుగా భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్టు తెలిపారు. ఈ అకౌంట్లోని ఆర్గానిక్ కంటెంట్ పై ఇంకా రివ్యూ పూర్తికాలేదని తెలిపింది. బంగ్లాదేశ్ కు చెందిన మాలిసియస్ ట్విట్టర్ అకౌంట్లను కూడా సస్పెండ్ చేసినట్టు ట్విట్టర్ హెడ్ ఆఫ్ సైట్ ఇంట్రిగ్రిటీ యోల్ రోత్ చెప్పారు. ఈ అకౌంట్లలో రెండు ట్వీట్ లు మొత్తం బెంగాలీ భాషలో ఉన్నట్టు తన బ్లాగ్ పోస్టులో రోత్ తెలిపారు.
ఇరాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న మొత్తం 2,617 మాలిసియస్ ట్విట్టర్ అకౌంట్లను గుర్తించి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. రష్యా నుంచి మొత్తం 3,843 ట్విట్టర్ ఖాతాలను తొలగించినట్టు ఆయన తెలిపారు. ఇంకా 418 అకౌంట్లపై రివ్యూ ప్రాసెస్ జరుగుతోందన్నారు. వెనిజూలాలో మాత్రం 764 అకౌంట్లను తొలగించినట్టు చెప్పారు. అదనంగా 1 వెయ్యి 196 అకౌంట్లను గుర్తించి తొలగించినట్టు తన బ్లాగ్ పోస్టులో వివరించారు.