Google I/O 2024 : గూగుల్ I/O ఈవెంట్.. కొత్తగా ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Google I/O 2024 Event : వారం క్రితమే పిక్సెల్ 8ఎ ఫోన్ లాంచ్ కాగా ఈరోజు అమ్మకానికి వస్తుంది. గూగుల్ ఈవెంట్ నుంచి ఏయే ప్రకటనలు, అప్‌డేట్స్ ఉండవచ్చు? భారత్‌లో ఈవెంట్‌ను ఎలా చూడాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Google I/O 2024 : గూగుల్ I/O ఈవెంట్.. కొత్తగా ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Google I_O 2024 tonight ( Image Credit : Google )

Google I/O 2024 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వార్షిక డెవలపర్ల కాన్ఫరెన్స్, (Google I/O) ఈ రాత్రికి ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ బిగ్ ఈవెంట్ షెడ్యూల్ భారతీయుల కోసం, రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 8aని లాంచ్ చేయనున్నట్లు గతంలో నివేదించింది. అయితే, కంపెనీ, ఆశ్చర్యకరంగా ఒక వారం క్రితమే ఈ పిక్సెల్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈరోజు పిక్సెల్ 8ఎ ఫోన్ అమ్మకానికి వస్తుంది. గూగుల్ ఈవెంట్ నుంచి ఏయే ప్రకటనలు, అప్‌డేట్స్ ఉండవచ్చు? భారత్‌లో ఈవెంట్‌ను ఎలా చూడాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : TVS iQube e-scooter : కొత్త వేరియంట్లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

భారత్‌లో గూగుల్ I/O లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? :
షెడ్యూల్ ప్రకారం.. గూగుల్ I/O 2024 ఈవెంట్ ఈరోజు (మంగళవారం (మే 14) రాత్రి 10:30 గంటలకు సుందర్ పిచాయ్ కీలక ప్రసంగంతో ప్రారంభం కానుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని షోర్‌లైన్ యాంఫీథియేటర్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. వ్యక్తిగతంగా హాజరు కాలేని టెక్ ఔత్సాహికుల కోసం ఈవెంట్ గూగుల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, I/O 2024 అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

గూగుల్ I/O ఈవెంట్ నుంచి ఏం ఉండొచ్చుంటే? :
చాట్‌జీపీటీ, కోపైలట్ వంటి జనరేటివ్ ఏఐ టూల్ప్‌పై క్రేజ్ నేపథ్యంలో గూగుల్ సొంత జెమినీ మోడల్ ద్వారా ఏఐ పట్ల మరింత దృష్టిపెట్టింది. పవర్‌ఫుల్ ఏఐ గూగుల్ లేటెస్ట్ చాట్‌బాట్‌ను రన్ చేయడమే కాకుండా శాంసంగ్ గెలాక్సీ లైనప్‌తో సహా ఇతర టెక్ దిగ్గజాల యాక్టివిటీలతో విలీనం చేసింది. రాబోయే ఈవెంట్ మరిన్ని సహకారాలను రివీల్ చేసే అవకాశం ఉంది. బహుశా ఆపిల్‌తో కూడా ఐఓఎస్ ఫీచర్‌లలో జెమిని ఏఐ ఇంటిగ్రేట్ చేయాలనే లక్ష్యంతో సెర్చ్ దిగ్గజం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

గూగుల్ సాంప్రదాయ అసిస్టెంట్ నుంచి అడ్వాన్స్‌డ్ జెమిని చాట్‌బాట్ వైపు టర్న్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అసిస్టెంట్-ఎనేబుల్డ్ స్మార్ట్ హోమ్ డివైజ్‌లపై గూగుల్ I/Oలో కీలక అంశంగా భావిస్తున్నారు. ఈ ఈవెంట్ జెమిని సిస్టమ్‌కు అప్‌గ్రేడ్స్, పిక్సెల్ డివైజ్‌ల కోసం కొత్త ఏఐ సామర్థ్యాలతో సహా గూగుల్ ప్రొడక్టుల అంతటా విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్‌లను గుర్తించే అవకాశం ఉంది.
గూగుల్ I/O 2024 ఈవెంట్లో ప్రధానంగా గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 గురించి మరిన్ని అప్‌డేట్స్ ఉంటాయని భావిస్తున్నారు.

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్, ఇతర ఫీచర్లు :
ఫస్ట్ బీటా రిలీజ్ తర్వాత ఈవెంట్ కొత్తవాటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించే అవకాశం ఉంది. గూగుల్ I/O సాంప్రదాయకంగా వినూత్నమైన యూజర్-ఫోకస్డ్ ఫీచర్‌లను ఆవిష్కరించడానికి వేదికగా నిలువనుంది. డెవలపర్‌లు, టెక్ ఔత్సాహికులు నేరుగా పాల్గొనే అవకాశాన్ని అందిస్తోంది. ప్రారంభ బీటాలో పాక్షిక స్క్రీన్ షేరింగ్, నోటిఫికేషన్ కూల్‌డౌన్ ఆప్షన్, ఎక్స్‌టెండెడ్ హెల్త్ ట్రాకింగ్ సామర్థ్యాలు వంటి ఫీచర్లను వెల్లడించింది. యాప్ పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్, యాప్ స్టోరేజీకి సంబంధించి కొత్త ఏపీఐ (API)లను కూడా ప్రవేశపెట్టింది.

గూగుల్ పిక్సెల్ 8ఎ లాంచ్‌తో పాటు గూగుల్ I/O ఈవెంట్లో కొన్ని హార్డ్‌వేర్ అప్‌డేట్స్ కలిగి ఉండవచ్చు. పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ ఫోల్డ్ సంబంధించిన ప్రకటనలపై ఊహాగానాలు సూచిస్తున్నాయి. అయితే, పూర్తిస్థాయి లాంచ్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. పిక్సెల్ టాబ్లెట్ 2 డివైజ్ గురించి కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, గత మోడల్ డాక్‌లెస్ వేరియంట్‌ను ఇటీవలే ప్రవేశపెట్టడంతో కొత్త టాబ్లెట్ వెంటనే రాకపోవచ్చు. కానీ, ఈవెంట్లో రాబోయే డివైజ్ టీజర్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది.

Read Also : Vivo X100 Ultra : 200ఎంపీ టెలిఫొటో కెమెరాతో వివో x100 అల్ట్రా ఫోన్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!