Google Pay Soundpad : పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా గూగుల్ పే సౌండ్‌ప్యాడ్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Google Pay Soundpad : డిజిటల్ పేమెంట్ యాప్స్ పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా యూపీఐ పేమెంట్ల కోసం గూగుల్ మొట్టమొదటి వైర్‌‌లెస్ సౌండ్‌ప్యాడ్ భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ధర, ఫీచర్లు వివరాలను ఓసారి లుక్కేయండి.

Google Pay Soundpad : పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా గూగుల్ పే సౌండ్‌ప్యాడ్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Google Pay Introduces Soundpad For Merchants Using UPI

Google Pay Soundpad : ప్రపంచ సెర్చ్ దిగ్గజం గూగుల్ మొట్టమొదటి వైర్‌లెస్ స్పీకర్ సౌండ్‌‌ప్యాడ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ అత్యాధునిక డివైజ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా వేగంగా పేమెంట్లు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇతర డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ఫోన్‌పే, పేటీఎం వంటి పోటీదారులు భారతీయ మార్కెట్‌లోని చిన్న వ్యాపారుల కోసం సౌండ్‌బాక్స్ డివైజ్‌లను అందుబాటులో తీసుకొచ్చారు. డిజిటల్ పేమెంట్స్ విభాగంలో పోటీ పడేందుకు గూగుల్ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో సౌండ్‌ప్యాడ్ డివైజ్ అందుబాటులోకి తీసుకురానుంది.

అధునాతన టెక్నాలజీ కలిగిన ఈ డివైజ్ భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. సౌండ్‌ప్యాడ్ డివైజ్ ఆవిష్కరణపై గూగుల్ ప్రొడక్టుల వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విస్తరణ రాబోయే నెలల్లో భారత్ అంతటా చిన్న వ్యాపారులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.

గూగుల్ సౌండ్‌ప్యాడ్ ఫీచర్లు :
గూగుల్ పే సౌండ్ ప్యాడ్‌లో ఎల్‌సీడీ స్క్రీన్, సింగిల్ స్పీకర్‌తో 4జీ కనెక్టివిటీని కలిగి ఉంది. మొత్తం మూడు ఎల్ఈడీ ఇండికేటర్లతో వస్తుంది. డివైజ్ బ్యాటరీ లైఫ్ ఛార్జింగ్, కనెక్టివిటీపై స్టేటస్ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది. ఇందులో మెను, వాల్యూమ్, పవర్ బటన్‌లు వినియోగదారులకు మరింత ప్రయోజకరంగా ఉంటాయి. పేటీఎం ‘సౌండ్‌బాక్స్’ స్పీకర్లు 2జీ లేదా 4జీ కనెక్టివిటీ ఆప్షన్లతో పాటు 4 నుంచి 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. కొన్ని మోడల్స్ ఎల్‌సీడీ స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. మరికొన్ని బ్లూటూత్-ఎనేబుల్డ్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు సపోర్టు ఇస్తాయి. మరోవైపు, ఫోన్‌పే కూడా స్మార్ట్ స్పీకర్ బాక్సుపై గరిష్టంగా నాలుగు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అంతేకాదు.. అనేక ప్రాంతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది.

సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే :
భారత మార్కెట్లో గూగుల్ పే సౌండ్‌ఫ్యాడ్ కచ్చితమైన లాంచ్ తేదీని సెర్చ్ దిగ్గజం వెల్లడించలేదు. ఫోన్‌పే, పేటీఎం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి డివైజ్‌లను చిన్నవ్యాపారులకు అందిస్తున్నాయి. ఈ డివైజ్ కొనుగోలుపై ఆడియో ఆధారిత సర్వీసుల యాక్సెస్ కోసం నెలవారీ రుసుమును రూ. 50 నుంచి నుంచి రూ. 125 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

భారత్‌లో సౌండ్‌ప్యాడ్ డివైజ్ కోసం గూగుల్ రెండు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లను అందించాలని యోచిస్తోంది. చిన్న వ్యాపారులు రూ. 499 వన్-టైమ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి రూ. 125 లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 1,499 ఎంచుకోవచ్చు. ఈ లాంగ్ ప్లాన్ తీసుకునే యూజర్లకు వన్-టైమ్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తుంది. అంతేకాకుండా, క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలవారీ 400 చెల్లింపులను పూర్తి చేసే వ్యాపారులు రూ.125 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

భారత మార్కెట్లో గూగుల్ పే సౌండ్‌ప్యాడ్ ప్రారంభంలో ఒక పైలట్ ప్రోగ్రామ్‌గా ప్రవేశపెట్టనుంది. ప్రత్యేకంగా ఢిల్లీ వంటి ఉత్తర ప్రాంతాలలోని వ్యాపారులను లక్ష్యంగా అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో గూగుల్ దేశవ్యాప్తంగా సౌండ్‌ప్యాడ్ డివైజ్‌లను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది.

Read Also : PhonePe UPI Lite : పోన్‌పేలో ఇకపై యూపీఐ పిన్ లేకుండానే పేమెంట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!