ఈజీగా పంపొచ్చు.. Like కొట్టొచ్చు : Google Photosలో కొత్త Chat ఫీచర్ 

  • Published By: sreehari ,Published On : December 5, 2019 / 01:36 PM IST
ఈజీగా పంపొచ్చు.. Like కొట్టొచ్చు : Google Photosలో కొత్త Chat ఫీచర్ 

Updated On : December 5, 2019 / 1:36 PM IST

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ గూగుల్ ఫొటోస్ సర్వీసులో ఫొటోలను పంపే కొత్త మార్గాన్ని కనిపెట్టింది. గూగుల్ ఫొటోస్‌లో కొత్తగా Chat Feature యాడ్ చేసింది. ఒకే సమయంలో అన్ని హాలిడే ఫొటోలను ఈజీగా ఇతరులకు షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

మరో యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే అదే యాప్‌లోని Chat బాక్సు నుంచి ఫొటోలు, వీడియోలను సులభంగా షేర్ చేసుకోవచ్చు. లైకులు కూడా కొట్టవచ్చు. ఈ కన్వెర్షన్ ఆప్షన్.. వచ్చే వారం గూగుల్ ఫొటోస్ సర్వీసు వాడే ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్ ఫాంపై కనిపించనుంది.

ఒకసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. యూజర్లు సెలెక్ట్ చేసిన ఏ ఫొటో అయినా సరే తమ కాంటాక్టుల నుంచి నేరుగా మరొకరికి Send చేసుకోవచ్చు. మరో యాప్ నుంచి లింక్స్ లేదా ఫొటోల రూపంలో పంపనక్కర్లేదు. పంపిన ఫొటోలు, లైక్ చేసిన ఫొటోలన్నీ చాట్ బాక్సులోనే సేవ్ చేసుకోవచ్చు.

‘మీ స్నేహితులు, ఫ్యామిలీతో షేర్ చేసిన క్షణాలను ఒకే చోట గుర్తించడమే కాకుండా కాన్వర్జేషన్ కొనసాగించేలా సహకరిస్తుంది’ అని గూగుల్ జాన్వీ షా ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. మీ సంభాషణకు సంబంధించి ఫొటోలను లైక్ కొట్టడం లేదా కామెంట్లు చేసుకోవచ్చు. ఫొటోలు లేదా వీడియోలను మీ సొంత గ్యాలరీలోకి ఈజీగా సేవ్ చేసుకోవచ్చు కూడా.

ఇదిగో ప్రాసెస్.. ఓసారి ట్రై చేయండి :
* ముందుగా గూగుల్ ఫొటోస్‌లో ఒక ఫొటోపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
* Share బటన్ పై క్లిక్ చేసిన వెంటనే Google Photosలో Send బటన్ కనిపిస్తుంది.
* అక్కడ మీ కాంటాక్టులకు సంబంధించి ఓ List కనిపిస్తుంది.
* గూగుల్ అకౌంట్లో Signed అయిన వారు మాత్రమే ఈ Conversation చూడొచ్చు.
* ఎక్కువ మందికి ఫొటోలను Send చేయాలంటే Group Chat క్రియేట్ ఆప్షన్ ఉంది.