Gmail Account Delete : యూజర్లకు వార్నింగ్.. ఈ 2 పనులు చేయలేదంటే.. మీ జీమెయిల్ అకౌంట్లన్నీ గూగుల్ డిలీట్ చేస్తుంది జాగ్రత్త..!

Gmail Account Delete : జీమెయిల్ అకౌంట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. జీమెయిల్ యూజర్లు తమ అకౌంట్ సేవ్ చేయడానికి కేవలం 2 పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఓసారి లుక్కేయండి.

Gmail Account Delete : యూజర్లకు వార్నింగ్.. ఈ 2 పనులు చేయలేదంటే.. మీ జీమెయిల్ అకౌంట్లన్నీ గూగుల్ డిలీట్ చేస్తుంది జాగ్రత్త..!

Google will delete your Gmail accounts if you haven't done these 2 things

Updated On : August 21, 2023 / 6:40 PM IST

Gmail Account Delete : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ఎన్ని జీమెయిల్ అకౌంట్లను వాడుతున్నారా? ప్రస్తుతం మీ జీమెయిల్ అకౌంట్లు అన్ని యాక్టివ్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నారా? ఎందుకుంటే.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తమ సర్వీసుల్లో ఒకటైన జీమెయిల్ అకౌంట్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గూగుల్ ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది.

అయితే ఈ విషయంలో జీమెయిల్ యూజర్లు భయపడాల్సిన అవసరం లేదు. జీమెయిల్ డిలీట్ ప్రాసెస్ వెంటనే జరగదు. కొన్ని నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు గూగుల్ జీమెయిల్ అకౌంట్ యూజర్లకు రిమైండర్లను పంపుతోంది. నిర్దిష్ట గూగుల్ అకౌంట్ల తొలగింపుపై కంపెనీ వినియోగదారులకు ఇమెయిల్స్ పంపుతోంది. ఈ క్రమంలో మీ జీమెయిల్ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు? అవేంటో లోతుగా పరిశీలిద్దాం.

జీమెయిల్ అకౌంట్ల తొలగింపు ప్రక్రియ :
గూగుల్ అకౌంట్లు కనీసం 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే తప్ప ఈ మార్పులు యూజర్లపై ప్రభావం చూపదు. మీరు గత రెండేళ్లలో మీ జీమెయిల్ లేదా గూగుల్ అకౌంట్ ఉపయోగించకుంటే.. మీ అకౌంట్ త్వరలో డిలీట్ అవుతుంది. YouTube వంటి ఏదైనా గూగుల్ సర్వీసును 2 ఏళ్లకు మించి అకౌంట్ యాక్సెస్ చేయకుండా ఉంటే.. మీ అకౌంట్ కంపెనీ సర్వర్‌ల నుంచి డిలీట్ చేయనుంది. డిసెంబర్ 2023 వరకు జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేయరాదని గూగుల్ స్పష్టంగా పేర్కొంది.

Read Also : Google Search: గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్ వచ్చేసింది.. ప్రస్తుతం ఆ ఒక్క భాషలో మాత్రమే అందుబాటులోకి..

ఇప్పటికీ, జీమెయిల్ అకౌంట్ ఉపయోగిస్తున్నారని గూగుల్ విశ్వసించేలా చేసేందుకు యూజర్లకు ఇంకా సమయం ఉంది. గూగుల్ మేనేజ్‌మెంట్ అకౌంట్ ద్వారా డిస్‌ప్లే అవుతుంది. గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ చేసిన ఏదైనా అకౌంట్‌పై చర్యలు తీసుకోవచ్చు. మీ ఫోన్‌లో..ఒకటి కన్నా ఎక్కువ గూగుల్ అకౌంట్లను సెటప్ చేసి ఉంటే డివైజ్ ప్రతి అకౌంట్ 2 ఏళ్ల వ్యవధిలో యాక్టివ్‌లో ఉందని నిర్ధారించుకోవాలి’ అని కంపెనీ సపోర్టు పేజీలో పేర్కొంది.

గూగుల్ నేరుగా మీ అకౌంట్ డిలీట్ చేస్తుందా? :
అకౌంట్ ఇన్ యాక్టివ్‌గా గుర్తించిన సందర్భాల్లో.. యూజర్లకు రీస్టోర్ ఇమెయిల్ అడ్రస్‌లకు రిమైండర్ ఇమెయిల్స్‌ను గూగుల్ పంపుతుంది. కంటెంట్‌ను డిలీట్ చేయడం లేదా అకౌంట్ క్యాన్సిల్ చేయడం వంటి ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు ఈ ఇమెయిల్‌లను రిలీజ్ చేస్తుంది. గూగుల్ అకౌంట్ డిలీట్ చేసిన తర్వాత యూజర్లు అదే జీమెయిల్ అడ్రస్ కలిగి ఉండలేరు లేదా తిరిగి పొందలేరని గమనించాలి. ఆపై జీమెయిల్ కొత్త ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Google will delete your Gmail accounts if you haven't done these 2 things

Gmail Account Delete : Google will delete your Gmail accounts if you haven’t done these 2 things

ఇన్‌యాక్టివ్ గూగుల్ అకౌంట్ ఏంటి? :
ఇన్ యాక్టివ్ గూగుల్ అకౌంట్ అనేది 2 ఏళ్ల వ్యవధిలో ఉపయోగించని జీమెయిల్ అకౌంట్.. మీరు కనీసం 2 సంవత్సరాల పాటు గూగుల్ సర్వీసులను ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లయితే.. ఇన్‌యాక్టివ్ గూగుల్ అకౌంట్లను దాని యాక్టివిటీ డేటాను డిలీట్ చేసే హక్కు గూగుల్‌కు ఉంది. మీరు కనీసం రెండేళ్లపాటు ఆ ప్రొడక్టులో ఇన్‌యాక్టివ్‌గా ఉంటే.. ఆ ప్రొడక్టులోని డేటాను డిలీట్ చేసే హక్కు కూడా గూగుల్‌కు ఉంది.

మీ జీమెయిల్ అకౌంట్ ఎలా యాక్టివ్‌గా ఉంచుకోవాలి? :
మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేశాక.. రెండు ఏళ్ల వ్యవధిలో కొన్ని ఇమెయిల్‌లను పంపినట్లు లేదా చదివినట్లు నిర్ధారించుకోవచ్చు. మీ YouTubeలో కంటెంట్‌ని చూడటానికి, ఫొటోలను షేర్ చేయడానికి, Play Store నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి మీ గూగుల్ అకౌంట్ ఉపయోగించాలి.

మీరు మీ అకౌంట్ ఉపయోగించి సర్వీసుల్లో దేనినైనా ఉపయోగించాలని కంపెనీ చెబుతోంది. అప్పుడు మాత్రమే మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆయా జీమెయిల్ అకౌంట్లను గూగుల్ డిలీట్ చేయదు. యూజర్లు తమ అకౌంట్ ఉపయోగించి ఫైల్‌ల కోసం గూగుల్ డిస్క్ లేదా గూగుల్ సెర్చ్ ఉపయోగించవచ్చు. తద్వారా గూగుల్ అకౌంట్ యాక్టివ్ ఉంటుంది.

Read Also : Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు..!