WhatsApp Silence Tips : వాట్సాప్‌లో గుర్తుతెలియని కాల్స్ వస్తున్నాయా? వెంటనే ఇలా మ్యూట్ చేయండి..!
WhatsApp Silence Tips : వాట్సాప్‌లో గుర్తుతెలియని కాల్స్ వస్తున్నాయా? అయితే, ఇలాంటి స్పామ్ కాల్స్ మ్యూట్ చేయాలంటే తప్పక ఈ టిప్స్ పాటించండి.

How to Silence Unknown Callers on WhatsApp for iOS and Android
WhatsApp Silence Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అనేక అవాంఛిత కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి గుర్తు తెలియని వాట్సాప్ కాల్స్ వెంటనే మ్యూట్ చేసుకోవచ్చు. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇప్పుడు గుర్తుతెలియని కాంటాక్టుల నుంచి వచ్చే స్పామ్ కాల్‌లను మ్యూట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ స్పామ్ కాల్‌లు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయని నంబర్ల నుంచి కూడా కావచ్చు. ఈ ఫీచర్ గత వారం ప్రారంభంలోనే రిలీజ్ అయింది. Android, iOS రెండింటిలో మొబైల్ యాప్‌లలో వాట్సాప్ స్టేబుల్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గత వారం ప్రకటనలో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ వాట్సాప్ యూజర్లకు గుర్తుతెలియని కాంటాక్టుల నుంచి వచ్చే ఇన్‌కమింగ్ కాల్‌లను సైలంట్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ను ప్రకటించారు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ వాట్సాప్ స్టేబుల్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు వాట్సాప్ ఈ స్పామ్ కాల్‌లను స్వీకరిస్తూనే ఉంటారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్‌లను సైలంట్ చేస్తే ఈ కాల్‌లు రింగ్ కావు. మీరు మీ వాట్సాప్ కాల్‌లో తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్‌లను సైలెంట్ మోడ్‌లో ఇలా ఉంచుకోవచ్చు.

How to Silence Unknown Callers on WhatsApp for iOS and Android
* మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
* ‘Settings’కి వెళ్లి, ‘Privacy’ ఆప్షన్ ఎంచుకోండి.
* ‘Privay’ ఆప్షన్‌లో ‘Calls’ ట్యాబ్‌ను ఎంచుకోండి.
* మీరు ‘Silence Unknown Calls’ కోసం టోగుల్‌ను ఎనేబుల్ చేయొచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్లు డాట్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ‘Settings’ యాక్సెస్ చేయవచ్చు. ఐఫోన్ వినియోగదారులు ‘Settings’ మెనుని చేరుకోవడానికి గేర్ ఐకాన్ ఎంచుకోవచ్చు. అలాగే, వినియోగదారులు స్పామ్ కాల్‌లతో సహా తమ కాంటాక్ట్‌లలో సేవ్ చేయని కాంటాక్ట్‌ల నుంచి కాల్‌లను వినడాన్ని కొనసాగించాలనుకుంటే ‘Silence Unknown Calls’ కోసం టోగుల్‌ను కూడా నిలిపివేయవచ్చు. వాట్సాప్ వినియోగదారులు సేవ్ చేయని తెలిసిన నంబర్‌ల నుంచి ముఖ్యమైన కాల్‌లను మిస్ చేయకూడదనుకుంటే వారి కాంటాక్ట్ లిస్ట్‌లలో నంబర్‌లను సేవ్ చేయడానికి ఎంచుకోవచ్చు.