Huawei P60 Series 5G : హువావే నుంచి 5G సపోర్టుతో రెండు సరికొత్త P60 సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Huawei P60 Series 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? హువావే (Huawei) నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఎలాంటి ఫీచర్లతో వచ్చాయో ఓసారి లుక్కేయండి.

Huawei P60, Huawei P60 Pro Gets 5G Series ( Photo : Google)
Huawei P60 Series 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ హువావే (Huawei) నుంచి (Huawei P60), (Huawei P60 Pro) అనే రెండు సరికొత్త 5G ఫోన్లు వచ్చేశాయి. ఇటీవల చైనాలో 4G కనెక్టివిటీతో మాత్రమే ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ ఫోన్‌లు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన కేసు కారణంగా 5G కనెక్టివిటీకి సపోర్టు అందిస్తాయి. చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు 5Gకి సపోర్టునిచ్చే రెండు హ్యాండ్‌సెట్‌ల కోసం కేసులను ప్రవేశపెట్టింది. ఈ కేసు మెటల్ గ్రే కలర్‌లో వస్తుంది. PU మెటీరియల్‌తో తయారు చేసింది. ఇందులో డ్యూయల్ మోడ్ 5G SA, NSA ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను కూడా అందిస్తుంది.
(Huawei) సెంట్రల్ నివేదిక ప్రకారం.. Soyealink Huawei P60, P60 ప్రో ఒక కేసును ప్రారంభించింది. ఈ హ్యాండ్‌సెట్‌లలో 5G కనెక్టివిటీని అందించడమే కాకుండా 88W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందించే ఇంటర్నల్ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. ఈ కేసు హై-క్వాలిటీ PU మెటీరియల్‌తో తయారు అయింది. మెటల్ గ్రే కలర్‌లో లభిస్తుంది. డ్యూయల్ మోడ్ 5G SA, NSA ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను అందిస్తుంది. ఈ ఫోన్‌లకు కనెక్ట్ అయిన తర్వాత కేస్ ఆన్-స్క్రీన్ 5G మేనేజ్‌మెంట్ సూచనలను అందిస్తుంది.

Huawei P60, Huawei P60 Pro Gets 5G Series (Photo : Google)
ముఖ్యంగా, ఈ కేస్ eSIMతో మాత్రమే పని చేస్తుందని గమనించాలి. ఫిజికల్ SIM కార్డ్‌లో 5G సపోర్టు ఉండదు. Huawei P60, Huawei P60 Pro డ్యూయల్ సిమ్ 4G కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లు ఇటీవల చైనాలో లాంచ్ కాగా.. 6.67-అంగుళాల Full-HD+ (1,220 x 2,700 పిక్సెల్‌లు) OLED LTPO డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1440Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌తో ఉన్నాయి. ఈ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 4G SoC ద్వారా పవర్ అందిస్తున్నాయి. HarmonyOS 3.1పై రన్ అవుతాయి.
LED ఫ్లాష్‌తో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో వచ్చాయి. Huawei P60లో 48-MP ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 13-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, OISతో 12-MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. మరోవైపు, Huawei P60 Pro OISతో రెండు 48-MP సెన్సార్లు, 13-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు రెండు ఫోన్‌లు ముందు భాగంలో 13-MP సెన్సార్‌ను కలిగి ఉంటాయి.