Formula-E race In Hyderabad : ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించటమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ఫార్ములా-E రేస్..
ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడమే ఫార్ములా-E రేస్ లక్ష్యం. ప్రపంచ దేశాలకు సైతం ఇప్పుడు ఇదే టార్గెట్. అంతలా ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని పెంచడం ఎందుకు..? అలాంటి ప్రతిష్టాత్మక రేస్‌ను హైదరాబాద్‌లోనే ఎందుకు పెట్టాలని నిర్ణయించుకున్నారు...? రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే మన భవిష్యత్తు కాబోతున్నాయా..? దీనిలో హైదరాబాద్ పాత్ర ఏమిటీ?..

Formula-E race In Hyderabad
Formula-E race In Hyderabad : ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడమే ఫార్ములా-E రేస్ లక్ష్యం. ప్రపంచ దేశాలకు సైతం ఇప్పుడు ఇదే టార్గెట్. అంతలా ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని పెంచడం ఎందుకు..? అలాంటి ప్రతిష్టాత్మక రేస్‌ను హైదరాబాద్‌లోనే ఎందుకు పెట్టాలని నిర్ణయించుకున్నారు…? రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే మన భవిష్యత్తు కాబోతున్నాయా..? దీనిలో హైదరాబాద్ పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
హైదరాబాద్ ఫార్ములా-E రేస్‌లోని కార్లు పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ. ఫార్ములా వన్ కార్లలో పెట్రోల్ వినియోగిస్తారు. అందుకే ఫార్ములా-E రేస్‌కు ఫార్ముల్ వన్‌తో పోలిస్తే పర్యావరణ హితంగా ప్రాధాన్యత ఎక్కువ. ఫార్ములా-E రేస్ ద్వారా పొల్యుషన్ తగ్గించేందుకు .. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలనే సంకేతాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ రేస్ నిర్వహించడానికి కూడా ఇదే ప్రధాన కారణం. సాఫ్ట్ వేర్.. పారిశ్రామకి రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయిని చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి నగరం కేరాఫ్‌గా నిలిచింది. అనేక ప్రోత్సహకాలు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయంగా గత ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. ప్రభుత్వాలు సైతం ప్రజలు ఎలక్ట్రికల్ కార్లు, బైక్లు వాడేలా ప్రోత్సహిస్తున్నాయి. హైదరాబాద్ సైతం ఈ మార్గంలోనే వెళ్తోంది.
ఫార్ములా -E రేస్ ప్రారంభించే ముందు చాలా నగరాలను పరిశీలించారు నిర్వాహాకులు. ఇందులో హైదరాబాద్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేయడం గమనించారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు చాలా ఉన్నాయి. సిటీలో గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవల పూర్తిగా కరెంట్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురావడం దీనికి ఉదాహరణ.
పెట్రోల్, డిజీల్ తయారీకి అవసరమైన ముడి చమురు నిల్వలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. అందుకే చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఇది తీవ్ర వినాసనానికి దారి తీసే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలానే కొనసాగితే మన సౌకర్యం కోసం వినియోగించే కార్లే మనకు పెను ముప్పును తెచ్చిపెడతాయంటున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రికల్ వాహనలే దిక్కనే మాట వినిపిస్తోంది. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకునే మొదటి నుంచి తెలంగాణలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా అడుగులు పడ్డాయి.