Apple iOS 18 Update : ఐఓఎస్ 18 అప్‌డేట్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు మీకోసం..

Apple iOS 18 Update : ఆపిల్ ప్రకారం.. ఐఓఎస్ 18 అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌గా వచ్చే సోమవారం (సెప్టెంబర్ 16)న లాంచ్ కానుంది.

Apple iOS 18 Update : ఐఓఎస్ 18 అప్‌డేట్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు మీకోసం..

iOS 18 Update With Apple Intelligence and Other New Features

Apple iOS 18 Update : ఆపిల్ ఐఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో iOS 18 ఐఫోన్ వినియోగదారులకు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఈ మేరకు ఆపిల్ సోమవారం ధృవీకరించింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా అనేక కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇందులో చాలా వరకు ఆపిల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూట్ ద్వారా అందిస్తుంది.

Read Also :  Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!

గత జూన్‌లో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో మొదటిసారిగా ఆపిల్ ఈ ఐఓఎస్ 18 ప్రకటించింది. రాబోయే ఐఫోన్ అప్‌డేట్, ఇతర మెరుగుదలలతో పాటు కొత్త హోమ్ స్క్రీన్ కస్టమైజడ్ ఆప్షన్లను అందిస్తుంది. ఐఫోన్ 16 లాంచ్ తర్వాత ఆపిల్ iOS 18 అప్‌డేట్ లాంచ్ తేదీని వెల్లడించింది. అలాగే, ఏయే ఐఫోన్లలో ఈ ఐఓఎస్ 18 అప్‌‌డేట్ అందుబాటులోకి వస్తుందో ఐఫోన్ల లిస్టును ధృవీకరించింది.

iOS 18 అప్‌డేట్ లాంచ్ తేదీ :
ఆపిల్ ప్రకారం.. ఐఓఎస్ 18 అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌గా వచ్చే సోమవారం (సెప్టెంబర్ 16)న లాంచ్ కానుంది. భారత మార్కెట్ సహాఅమెరికా ఇతర ప్రాంతాలలో ఐఫోన్ సేల్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు అందుబాటులోకి రానుంది. మొదటి ఐఓఎస్ 18 అప్‌డేట్‌తో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లన్నీ యూజర్‌లకు అందుబాటులో ఉండవని గమనించాలి.

వచ్చే నెల ఐఓఎస్ 18.1 అప్‌డేట్‌తో ఫస్ట్ సెట్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం తెలిపింది. స్మార్ట్ సిరి, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఇతర ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు రాబోయే నెలల్లో ప్రవేశపెట్టనుంది. ఇంగ్లీషుతో పాటు, చైనీస్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషలను కాలక్రమేణా చేర్చడానికి ఆపిల్ ఇంటిలిజెన్స్ కూడా విస్తరించనుంది.

iOS 18 సపోర్టు చేసే డివైజ్‌లివే :
ఆపిల్ ఐఓఎస్ 18 డెవలపర్‌కు సపోర్టు చేసే అన్ని డివైజ్‌లు, పబ్లిక్ బీటా అప్‌డేట్‌లు, పబ్లిక్ వెర్షన్‌ను పొందడానికి అర్హత పొందుతాయని ఆపిల్ తెలిపింది. ఇందులో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి ఐఫోన్ ఎక్స్ఆర్ వంటి పాత హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.

ఈ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కూడా ఇప్పటికే ఉన్న మోడళ్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగిన డివైజ్‌ల లిస్టులో చేరింది. ఐఓఎస్ 18 అప్‌డేట్‌ను పొందే ఐఫోన్ మోడల్‌ల పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

  • ఐఫోన్ 16 సిరీస్
  • ఐఫోన్ 15 సిరీస్
  • ఐఫోన్ 14 సిరీస్
  • ఐఫోన్ ఎస్ఈ (2022)
  • ఐఫోన్ 13 సిరీస్
  • ఐఫోన్ 12 సిరీస్
  • ఐఫోన్ 11 సిరీస్
  • ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్
  • ఐఫోన్ ఎక్స్ఎస్
  • ఐఫోన్ ఎక్స్ఆర్
  • ఐఫోన్ ఎస్ఈ (2020)

అయితే, ఈ మోడళ్లన్నింటికీ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఉండదని గమనించాలి. ఆపిల్ ఎ17 ప్రో లేదా నెక్ట్స్ ఎస్ఓసీ ద్వారా ఆధారితమైన ఐఫోన్ మోడల్‌లు మాత్రమే జనరేటివ్ ఏఐ ఫీచర్‌ల బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ మోడళ్లలో మొత్తం ఐఫోన్ 16 సిరీస్, అలాగే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఉన్నాయి.

Read Also : iPhone 16 Series : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ వచ్చేసిందోచ్.. మొత్తం 4 మోడల్స్, ధర, ఫుల్ ఫీచర్లు వివరాలివే..!