iPhone: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఐఫోన్ 17 ప్రో బ్యాక్‌సైడ్ అల్యూమినియం, గ్లాస్ మిక్స్‌తో రావచ్చు.

ఐఫోన్ 17 ప్రో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న ఐఫోన్ 16 కొనాలా? లేదంటే కొన్ని నెలలు ఆగి ఐఫోన్ 17 ప్రో కొనాలా? అని ఆలోచిస్తున్నారా? ఐఫోన్ 16 ప్రోలో చాలా అప్‌గ్రేడ్‌లు చేసి ఐఫోన్ 17 ప్రోను తీసుకువచ్చే అవకాశం ఉంది. వాటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకోండి..
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను ఆ కంపెనీ టైటానియం ఫ్రేమ్‌తో తీసుకొచ్చింది. అదే టైటానియం ప్రేమ్‌ను ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో కొనసాగించింది. ఇప్పుడు మాత్రం ఐఫోన్ 17 ప్రోలో అల్యూమినియం ప్రేమ్ వాడతారని రిపోర్టులు చెబుతున్నాయి.
Also Read: ఆ దేశంలోనూ భూముల ఆక్రమణకు నిత్యానంద ప్రయత్నాలు.. చివరకు పోలీసులు వచ్చి..
ఐఫోన్ 17 ప్రో బ్యాక్‌సైడ్ అల్యూమినియం, గ్లాస్ మిక్స్‌తో రావచ్చు. బ్యాక్ సైడ్ పై భాగం అల్యూమినియంతో వచ్చే అవకాశం ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కోసం కింది సగభాగం గ్లాస్‌తో ఉంటుంది. ఈ డిజైన్ డ్యురబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది.
ఐఫోన్ 17 ప్రోలో ఫ్రెష్ కెమెరా డిజైన్‌తో వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్ మోడళ్లలో ఇప్పటికే కనిపిస్తున్న స్క్వేర్ షేప్ కెమెరా బంప్‌లా కాకుండా ఆపిల్ ఇప్పుడు ఐఫోన్ 17 ప్రోలో మరింత రెక్టాంగుల్ లేదా పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్ రానుంది.
కొత్త కెమెనా సెన్సార్‌తో ఐఫోన్ 17 ప్రో వస్తోంది. అన్ని ఐఫోన్ 17 మోడల్స్ 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తాయని లీకుల ద్వారా తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రోలోని 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో పోల్చితే ఇది రెండింతలు పెరుగుతోంది. సెల్ఫీలు, వీడియో క్వాలిటీ బాగుంటుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ బ్యాక్ సైడ్‌లో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తోంది. మూడు 48 మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో రానున్న మొదటి ఐఫోన్ ఇదే.