BSNL Recharge Plan : BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ కేక.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ప్లాన్.. ఈ ప్లాన్ ఒకసారి రీఛార్జ్ చేస్తే 11 నెలల (330 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది.

BSNL Recharge Plan
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే.. ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL మరోసారి తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు 330 రోజులు అంటే.. 11 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు.
ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రమే కాకుండా (BSNL Recharge Plan) అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు అనేక ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. చాలా టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లు అప్‌గ్రేడ్ చేశాయి. కానీ, బీఎస్ఎన్ఎల్ ఈ ఒక్క ప్లాన్‌తో మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. బీఎస్ఎన్ఎల్ గతంలో కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. ఇంతకీ ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
బీఎస్ఎన్ఎల్ రూ. 1,999 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికగా ధర రూ. 1,999 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద కొంచెం తక్కువ డేటా మాత్రమే పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో ఏ నెట్ వర్క్ అయినా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.
2శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
ఈ రీఛార్జ్ ప్లాన్‌పై రోజుకు 100 SMS పంపుకోవచ్చు. అక్టోబర్ 15వ తేదీకి ముందు ఈ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే BSNL వెబ్‌సైట్, సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా 2శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను చౌకైన ధరకు పొందవచ్చు.