LG నుంచి 3 కొత్త బడ్జెట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

  • Published By: sreehari ,Published On : November 10, 2020 / 08:20 PM IST
LG నుంచి 3 కొత్త బడ్జెట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

Updated On : November 11, 2020 / 1:45 AM IST

LG W-series budget smartphones : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ LG కంపెనీ భారత మార్కెట్లోకి మూడు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. W సిరీస్ స్మార్ట్ ఫోన్లలో LG W11, LG W31, LG W31+ మూడు వేరియంట్లలో మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మూడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మిడ్ నైట్ బ్లూ కలర్ తో ఒకే రంగులో వచ్చాయి.

అంతేకాదు.. గూగుల్‌ అసిస్టెంట్ బటన్‌, ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లతో వచ్చాయి. గతంలో విడుదల చేసిన LG W10, W30, W30 pro మోడల్స్‌కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్లను LG కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.



LG W11 :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 6.52-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో octa-core ప్రాసెసర్‌ (2.0GHz octa-core SoC)ను వాడారు. మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. వెనక రెండు, ముందు భాగంలో ఒక కెమెరా ఇస్తున్నారు.



వెనక వైపు 13MP ప్రైమరీ సెన్సర్ కెమెరాతో పాటు 2MP సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా అమర్చారు. 4,000mAh బ్యాటరీ ఉంది. 3GB RAM‌/32GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

LG W31, LG W31+ ఫీచర్లు :
ఆక్టాకోర్ మీడియాటెక్‌ హీలియో P22 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.52-అంగుళాల HD+ ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లేతో వచ్చింది. 4GB RAM, 64GB/128GB ఆన్ బోర్డ్ స్టోరేజీతో పాటు micro SD card స్లాట్ కూడా అమర్చారు. ఈ రెండింటి ఫోన్లలో స్టోరేజీ ఒక్కటే తేడా ఉంటుంది.. W31 వేరియంట్‌లో 64GB స్టోరేజీ అందిస్తే.. W31+ వేరియంట్‌లో 128GB స్టోరేజీ అందించింది.



ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ రెండు వేరియంట్లు octa-core 2.0GHz ప్రాసెసర్ తోనే రన్ అవుతున్నాయి. కెమెరాల్లో మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. అందులో వెనుక వైపు 13MP ప్రధాన సెన్సార్, 5MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా అమర్చారు.



ఫ్రంట్ సైడ్ సెల్పీల కోసం 8MP షూటర్ అమర్చారు. గూగుల్ అసిస్టెంట్ బటన్ ఫీచర్ తో పాటు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. ఇక 4,000mAh బ్యాటరీ ఉంది. ఎల్‌జీ W11 స్మార్ట్ ఫోన్ (3GB RAM/32GB స్టోరేజీ) వేరియంట్ ధర రూ.9,490 నుంచి అందుబాటులో ఉంటుంది.

LG W31 వేరియంట్ ధర రూ.10,990, LG W31+ వేరియంట్ ధర రూ.11,990లకే లభ్యం కానుంది. వచ్చే నెల నుంచి ఈ బడ్జెట్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.