వైఫై సంకేతాలతోనే స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్

మీ స్మార్ట్ ఫోన్ ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్ తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? వైఫై తో స్మార్ట్ ఫోన్ చార్జ్ంగా వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేతలు. కానీ రెక్టెన్నాఅనే కొత్త పరికరం సాయంతో ఇది చాలా సులువైన పనే అని అంటున్నారు టోమ్స్ పలాసియోస్ అనే శాస్త్రవేత. ఏసీ విద్యుత్తు ద్వారా పుట్టే విద్యుదయస్కాంత తరంగాలను డీసీ తరంగాలుగా మార్చే పరికరమే రెక్టెన్నా.
మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్ర్తవేతలు తయారు చేసిన కొత్తరకం రెక్టెన్నా మాత్రం రేడియో తరంగాలను స్వీకరించి ఏసీ విద్యుత్ తరంగాలుగా మారుస్తుందన్నమాట. అయితే ఇప్పటి వరకూ రెక్టెన్నాతో ఉత్పత్తి చేయగలిగిన విద్యుత్తు చాలా తక్కువగా ఉండాటంతో ఈ రెక్టెన్నాను విస్త్రత స్థాయిలో వాడటం సాధ్యం కాలేదని తమ గాడ్జెట్ తో ఈ పరిస్థితి మారిపోతుందని టోమ్స్ తెలిపారు.
నేచర్ మ్యాగజైన్ లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ కొత్తతరం రెక్టెన్నాను చాలా చౌకగా, సులువుగా తయారు చేయవచ్చు. హైవేల వెంబడి కొత్త రెక్టెన్నాను భారీ సైజులో ఏర్వాటు చేయవచ్చునని తద్వారా బ్యాటరీల అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అన్నింటినీ చార్జ్ చేయవచ్చునని తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము తయారు చేసిన రెక్టెన్నాలతో 40 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామని..ఎల్ఈడీ స్క్రీన్లు మొదలుకొని అనేక వేరబుల్ గాడ్జెట్స్ కు ఈ మాత్రం విద్యుత్తు సరిపోతుందని వివరించారు.