Hypercar : ఊహించని నిర్ణయం తీసుకున్న మహీంద్రా.. త్వరలో హైపర్‌ కార్‌

ట్రాక్టర్ల తయారీతో తమ ప్రస్థానం మొదలు పెట్టిన మహీంద్రా, ఆ తర్వాత ఎస్‌యూవీను తయారు చేసి తన మార్కును చాటుకుంది. ఇక ఇప్పుడు హైపర్‌ కారు తయారీపై ఫోకస్‌ పెట్టింది.

Hypercar : ఊహించని నిర్ణయం తీసుకున్న మహీంద్రా.. త్వరలో హైపర్‌ కార్‌

Hypercar

Updated On : September 30, 2021 / 4:27 PM IST

Hypercar : దేశీయ వాహన తయారీ రంగం పుంజుకుంటుంది. ఎలక్ట్రిక్ బైక్స్ తోపాటు, లగ్జరీ కార్లను తయారు చేసేందుకు భారత కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ఒక ప్రకటన ఆసక్తిని కలిగిస్తోంది. ట్రాక్టర్ల తయారీతో తమ ప్రస్థానం మొదలు పెట్టిన మహీంద్రా, ఆ తర్వాత ఎస్‌యూవీను తయారు చేసి తన మార్కును చాటుకుంది. ఇక ఇప్పుడు హైపర్‌ కారు తయారీపై ఫోకస్‌ పెట్టింది.

Read More : Leopard Cub : చిరుతను దుప్పట్లో చుట్టేసి మహిళ…! సో గ్రేట్ అంటున్న అధికారులు,జనాలు

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పట్టు పెంచుకోవడంతో పాటు బ్రాండ్‌ ఇమేజ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడింది మహీంద్రా. ఈ నేపథ్యంలోనే హైపర్‌ కార్లపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా హై ఎండ్‌ లగ్జరీ కార్ల సెగ్మెంట్‌లో రెనాల్ట్‌, ఫోర్డ్‌లతో కలిసి ముందుకు సాగాలపి నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైపర్‌ కార్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన ఫినిన్‌ఫరినాతో జట్టు కట్టేందుకు మహీంద్రా సిద్ధమైందంటూ బ్లూబ్‌బర్గ్‌ మీడియా ప్రచురించింది. దీని ప్రకారం రాబోయే రెండేళ్లలో మహీంద్రా, ఫినిన్‌ఫరినా సంస్థలు సంయుక్తంగా హైపర్‌ కారుని మార్కెట్‌లోకి తేనున్నాయి.

Read More : Traffic Challan : బైక్ పై 88 చలాన్లు, రూ.28 వేల జరిమానా

మహీంద్రా – ఫినిన్‌ఫరినాల ఆధ్వర్యంలో తయారు చేయబోయేది పూర్తి ఎలక్ట్రిక్ కారు. దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక ఈ కారు ధర భారీగానే ఉండనుందని తెలుస్తోంది. ఈ హైపర్‌ కారు ధర 2.3 మిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి తొలి ఐదు బుకింగ్స్‌ పూర్తయ్యాయి. మహీంద్రా – ఫినిన్‌ఫరినాల భాగస్వామ్యంలో కేవలం 150 కార్లను మాత్రమే తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.