MG Motor Electric Car : ఎంజీ మోటార్ నుంచి రెండో ఎలక్ట్రిక్ కార్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే..?

MG Motor Electric Car : ఎంజీ మోటార్ నుంచి రెండో ఎలక్ట్రిక్ కార్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే..?

Mg Motor Electric Car (1)

Updated On : July 1, 2021 / 2:11 PM IST

MG Motor Electric Car ZS EV : ప్రముఖ ఆటోమాటివ్ స్పోర్ట్స్ కార్ తయారీ సంస్థ ఎంజీ మోటార్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు వస్తోంది. SUV కార్ల లైనప్‌లో సరసమైన ధరకే రెండో ఎలక్ట్రిక్ కారు ZS EV త్వరలో లాంచ్ కానుంది. Tata Nexon EV కారు ధరకు కొంచెం దగ్గరలోనే ఉంటుందట.. అయితే ఈ ZS EV కారు మాత్రం ప్రీమియం SUV కార్లలో వస్తోంది. అలాగే ఖరీదైనది కూడా.. వచ్చే రెండు ఏళ్లలో సరసమైన మరిన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఎంజీ మోటార్స్ లాంచ్ చేయనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఈ SUV కారు కాస్ట్.. Nexon EV కారు ధర కంటే కొంచె ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తమ రెండో EV కారును రూ.20 లక్షల కంటే తక్కువ ధరలో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

Mg Motor To Launch 2nd Affordable Electric Car Soon (1)

కరోనా పరిస్థితి దృష్ట్యా అవసరమైన మెటేరియల్స్ కొరత కారణంగా ఎప్పుడు లాంచ్ చేస్తామనేది మాత్రం కచ్చితమైన టైమ్ లైన్ చెప్పలేమంటోంది. రెండేళ్లలో లాంచ్ చేస్తామని భావిస్తున్నామని ఎంజీ మోటార్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రాక ముందే దేశంలో చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా కృషిచేస్తోంది. కొత్త చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పన్నులను కూడా తగ్గించిందని, ఈవీ వాహనాలను ప్రమోట్ చేయడంలో భాగంగా రాయితీలను అందిస్తోందని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త SUV ZS EV కారులోని స్పెషిఫికేషన్లకు సంబంధించి కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఇందులో బ్యాటరీ సైజు, డ్రైవింగ్ రేంజ్ ఎలా ఉంటుందో తెలియదు.. MG కంపెనీ ఇప్పటివరకూ ZS EV కారు 3వేల యూనిట్లను విక్రయించింది.

Nz Suv

MG ZS EV ధర రూ.20.99 లక్షలు (ఎక్స్-షోరూం). 44.5Wh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఇక డ్రైవింగ్ రేంజ్ 419km. ఈ కారులోని బ్యాటరీ Three-Phase Permanent Magnet Synchronous Motor కు కనెక్ట్ చేసి ఉంటుంది. దీని సామర్థ్యం 142 PS గరిష్టంగా శక్తిని అందించగలదు. పీక్ టార్క్ 350Nmగా ఉంది. Hyundai Kona Electric, Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq, Volkswagen Taigun మోడళ్లకు పోటీగా వస్తోంది.

Suv Cars

ఎంజీ తమ పోర్ట్ పోలియోలో Hector, Hector Plus, Gloster, ZS EV నాలుగు కార్లు ఉన్నాయి. మిడ్ సైజు SUVలో అత్యంత సరసమైన ధరకే Hector కారు వస్తోంది. ఇక Hector Plus కారు 7 సీట్ల వెర్షన్ తో వచ్చింది. ఇక Gloster కారు.. ఫుల్ సైజు SUV కారు.. ఇందులో Advanced Driver Aids System ఆఫర్ చేస్తోంది. రాబోయే కొత్త మిడ్ సైజు SUV కారుకు Astor అని పేరు పెట్టే అవకాశం ఉంది. పెట్రోల్ ఇంజిన్ తోనే ఈ కారు వచ్చే అవకాశం ఉంది. 1.5 లీటర్ ఇంజిన్ తో రానుంది. సాధారణంగా aspirated engine 118bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్ లో మాన్యువల్ గేర్ బాక్సుతో పాటు CVT ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ కూడా ఆఫర్ చేస్తోంది.