Microsoft Internet Explorer : మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు ఇక గుడ్‌బై.. కొత్త బ్రౌజర్ ఎడ్జ్‌కు మారాల్సిందే..!
Microsoft Internet Explorer : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్.. ఎట్టకేలకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ నిలిచిపోయింది. Microsoft Windows 10లో రన్ అయ్యే సిస్టమ్‌లలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను శాశ్వతంగా నిలిపివేసింది.

Microsoft finally kills Internet Explorer, forces users to transition to new browser (2)
Microsoft Internet Explorer : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) యూజర్లకు అలర్ట్.. ఎట్టకేలకు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (Internet Explorer) బ్రౌజర్ నిలిచిపోయింది. Microsoft Windows 10లో రన్ అయ్యే సిస్టమ్‌లలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. Microsoft Edge Update ద్వారా పాత బ్రౌజర్‌ను నిలిపివేసింది. Windows 10 క్లయింట్ వెర్షన్‌లలో Internet Explorer 11ని యాక్సెస్ చేయకుండా వినియోగదారులను నిషేధిస్తుంది. డిసెంబర్ 2022లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను శాశ్వతంగా తొలగించే ప్రణాళికను ప్రకటించింది. Microsoft Edge అప్‌డేట్ అన్ని డివైజ్‌లకు-వాణిజ్య, వినియోగదారు రెండింటికీ-ఒకే సమయంలో అందుతుంది. అయితే, ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ వినియోగదారులు ఆ మార్పును రివర్స్ చేయలేరని గమనించాలి.
అదనంగా, IE11 నుంచి Microsoft Edgeకి రీడైరెక్ట్ అవుతుందని సపోర్టు పేజీలో పేర్కొంది. IE మోడ్‌తో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే కొత్త బ్రౌజర్‌కి మారినట్లయితే, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని తొలగించడం వల్ల దానిపై ప్రభావం ఉండదని Microsoft గతంలో పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే.. Explorer యూజర్లు ఎటువంటి సమస్యలు లేకుండా కొత్త బ్రౌజర్‌ని ఉపయోగించగలరు. ఇప్పటికీ IE11ని ఉపయోగిస్తున్న యూజర్లకు Start Menu, టాస్క్‌బార్‌లోని ఐకాన్లు వంటి ఇండికేషన్లు జూన్ 13, 2023న షెడ్యూల్ అయ్యే Windows Security Update ద్వారా శాశ్వతంగా నిలిచిపోనుంది.

Microsoft finally kills Internet Explorer, forces users to transition to new browser
IE11 విజువల్ రిఫరెన్స్‌లు, స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్‌లోని IE11 ఐకాన్లు జూన్ 2023 విండోస్ సెక్యూరిటీ ద్వారా నిలిచిపోతాయి. Internet Explorer, లేదా IE, Windows 95 ఆపరేటింగ్ సిస్టమ్‌లో భాగంగా 1995లో మొదటిసారిగా రిలీజ్ అయింది. 2000ల ప్రారంభంలో 90 శాతానికి పైగా మార్కెట్ వాటాతో పాపులర్ బ్రౌజర్‌గా నిలిచింది. అయినప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (Mozilla Firefox), గూగుల్ క్రోమ్ (Google Chrome), ఆపిల్ సఫారి (Apple Safari) వంటి ప్రత్యర్థి బ్రౌజర్‌ల నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంది. ఈ బ్రౌజర్‌లలో స్పీడ్, సెక్యూరిటీ, యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందించాయి.

Microsoft finally kills Internet Explorer, forces users to transition to new browser
తద్వారా ఇంటెంట్ ఎక్స్‌ప్లోరర్ పతనానికి దారితీసింది. ఈ బ్రౌజర్ పనితీరును మెరుగుపరిచే ప్రయత్నంలో.. మైక్రోసాఫ్ట్ 2013లో IE 11ని రిలీజ్ చేసింది. ఆ సమయానికి, Google Chrome, Mozilla Firefox ఇప్పటికే IE స్థానాన్ని ఆక్రమించాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్లో లోడింగ్ స్పీడ్, సెక్యూరిటీ లోపాలు, కంప్యాటబిలిటీ సమస్యలకు దారితీసింది. 2015లో మైక్రోసాఫ్ట్ కొత్త వెబ్ బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను భర్తీ చేసేందుకు ఎడ్జ్ మెరుగైన పనితీరు, భద్రతా ఫీచర్లతో పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది.
Read Also : Tech Tips : వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!