Motorola Edge 50 Ultra : ఏఐ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవే

Motorola Edge 50 Ultra : మోటోరోలా ఇండియా నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్ కొత్త ఫోన్ జూన్ 18న లాంచ్ అవుతుందని ప్రకటించింది. దేశంలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ గురించి మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

Motorola Edge 50 Ultra : ఏఐ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవే

Motorola Edge 50 Ultra India Launch Date ( Image Source : Google )

Motorola Edge 50 Ultra : మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఎడ్జ్ 50 ప్రో మోడల్ ఇటీవల లాంచ్ అయిన ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లను కలిగి ఉన్న ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో స్మార్ట్‌ఫోన్ టాప్-ఎండ్ మోడల్‌గా రానుందని భావిస్తున్నారు అధికారిక లాంచ్‌కు ముందు.. ఈ హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లు ఫ్లిప్‌కార్ట్‌లోని మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యాయి.కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లతో రానుందని నివేదిక వెల్లడించింది.

Read Also : Vivo X Fold 3 Pro Launch : శాంసంగ్, వన్‌ప్లస్‌‌కు పోటీగా.. వివో కొత్త మడతబెట్టే ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

మోటోరోలా ఇండియా నుంచి రాబోయే స్మార్ట్‌ఫోన్ కొత్త ఫోన్ జూన్ 18న లాంచ్ అవుతుందని ప్రకటించింది. దేశంలో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ గురించి మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మైక్రోసైట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్క్రీన్ 2500 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 100 శాతం డీసీఐ-పి3 కలర్ గామట్ కవరేజీని కలిగి ఉండనుంది.

మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా లాంచ్ తేదీ, ముఖ్య ఫీచర్లు :
మోటోరోలా ప్రకారం.. ఎడ్జ్ 50 అల్ట్రాలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అమర్చబడి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. మోటో ఏఐకి సపోర్టు ఇస్తుంది. కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్ల సూట్, మ్యాజిక్ కాన్వాస్‌తో సహా వినియోగదారులు టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా ఏఐ ఫొటోలను రూపొందించేందుకు అనుమతిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా గ్లోబల్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న 16జీబీ ర్యామ్‌తో పోలిస్తే.. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. మోటోరోలా మూడు ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో వస్తుంది. మోటోరోలా ఫోన్ 125డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ 10డబ్ల్యూ వైర్‌లెస్ పవర్ షేరింగ్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ వంటి ఇతర ఫోన్లకు ఛార్జ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

100ఎక్స్ ఏఐ సూపర్ జూమ్ ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌తో కూడా రానుంది. వినియోగదారులు పీసీలకు యాప్స్‌కు టెక్స్ట్, ఫొటోలను కాపీ/పేస్ట్ చేసేందుకు డివైజ్‌ల మధ్య డేటాను షేర్ చేయడానికి ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించేందుకు అనుమతిస్తుంది. ఓఐఎస్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64ఎంపీ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 50ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సిస్టమ్ ఏఐ కస్టమ్ స్టేబులిటీ 100ఎక్స్ ఏఐ సూపర్ జూమ్ వంటి ఏఐ ఫీచర్లను కలిగి ఉండనుంది.

భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ధర :
మోటోరోలా భారత్‌లో ఎడ్జ్ 50 అల్ట్రా ధరను అధికారికంగా వెల్లడించలేదు. ముఖ్యంగా, గ్లోబల్ కౌంటర్ ధర 999 (దాదాపు రూ. 89 వేలు). మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పాంటోన్-వెరిఫైడ్ పీచ్ ఫజ్, ఫారెస్ట్ గ్రే సిలికాన్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో అందిస్తుంది.

Read Also : Bajaj Chetak 2901 : బజాజ్ చేతక్ 2901 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ స్పీడ్ 63కి.మీ.. ధర ఎంతో తెలుసా?