OnePlus 12 Price Drop : అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 12 Price Drop : అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,500తో వస్తుంది. ఈ వన్‌ప్లస్ అసలు ప్రారంభ ధర రూ. 64,999 నుంచి తగ్గింది.

OnePlus 12 Price drops on Amazon
OnePlus 12 Price Drop : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో సేల్ ఈవెంట్ లేకపోయినా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ డీల్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ, వన్‌ప్లస్ 12 తక్కువ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. లేటెస్ట్ వన్‌ప్లస్ ఫోన్ డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్ :
అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,500తో వస్తుంది. ఈ వన్‌ప్లస్ అసలు ప్రారంభ ధర రూ. 64,999 నుంచి తగ్గింది. రూ.5,499 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ కలిగి ఉంది. ప్రస్తుతానికి, ఇతర అధీకృత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ తక్కువ ధరకు వన్‌ప్లస్ 12ని అందించడం లేదు. ఆసక్తి ఉన్న యూజర్లు ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తక్కువ ధరతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
వన్‌ప్లస్ 12 కొనడం విలువైనదేనా? :
వన్‌ప్లస్ 12 ఫోన్ ఇప్పటికీ అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌ను కలిగి ఉంది. పవర్‌ఫుల్ హై-ఎండ్ మొబైల్ ప్రాసెసర్ కలిగి ఉంది. భారీ స్క్రీన్, బ్యాటరీ లైఫ్‌తో పర్ఫార్మెన్స్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అత్యుత్తమ సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే. హెచ్‌డీఆర్ 10 ప్లస్, డాల్‌బై విజన్, 4,500నిట్స్ గరిష్ట ప్రకాశం, ఇతర సపోర్టుతో 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంది. డిజైన్ కూడా ప్రీమియం, సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో యూజర్లకు అవసరమైయ్యే అన్ని ప్రైమరీ యుటిలిటీ ఫీచర్‌లతో వస్తుంది. ఇందులో యాప్ లాక్, యాప్‌లను హైడ్ చేయడం వంటివి ఉన్నాయి.
వన్‌ప్లస్ 12కి 4ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ ఫోన్ ధర పరిధిలోని ఇతర ఫోన్‌లతో పోలిస్తే.. అద్భుతమైన డేలైట్ షాట్‌లను తీసుకోగలదు. ఇతర ప్రధాన బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా, వన్‌ప్లస్ ఇప్పటికీ ఫోన్‌లతో ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 12 80డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. వన్‌ప్లస్ 12 ఫోన్ ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ధరకు విక్రయిస్తోంది.
Read Also : Honor X9c Launch : అద్భుతమైన ఫీచర్లతో హానర్ X9c ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, స్పెసిఫికేషన్లు వివరాలివే!