OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు, ధర, లాంచ్ టైమ్‌లైన్ లీక్!
OnePlus Nord CE 4 Lite 5G Launch : టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్లో రూ. 20వేలు లోపుగా ఉండవచ్చని అంచనా. వచ్చే జూన్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

OnePlus Nord CE 4 Lite 5G Price in India ( Image Credit : Google )
OnePlus Nord CE 4 Lite 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఏప్రిల్ 2023లో ప్రవేశపెట్టిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీకి సక్సెసర్‌గా ఈ ఏడాది చివరిలోలాంచ్ కానుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ వన్‌ప్లస్ నార్డ్ 4 5జీతో పాటు వచ్చే అవకాశం ఉంది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 3 5జీకి అప్‌గ్రేడ్‌తో రానుంది.
ఏ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనుందో కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఇటీవల, వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ, నార్డ్ సీఈ 4 లైట్ 5జీ రెండూ బ్లూటూత్ ఎస్ఐజీ SIG వెబ్‌సైట్‌తో సహా అనేక ధృవీకరణ సైట్‌లలో గుర్తించారు. ఇప్పుడు, ఒక టిప్‌స్టర్ ఫోన్‌ల లాంచ్, ధర, ఫీచర్ వివరాలను రివీల్ చేసింది.
భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ధర, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్లో రూ. 20వేలు లోపుగా ఉండవచ్చని అంచనా. వచ్చే జూన్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. టిప్‌స్టర్ కూడా వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ ఫోన్ జూలైలో రూ. 31,999కు పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ 6.67-అంగుళాల 120Hz ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ, 5,500ఎంఎహెచ్ బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుంది. మూడు ఏళ్ల భద్రతా అప్‌డేట్‌లతో పాటు రెండు ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లను పొందవచ్చు.
కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన బ్యాక్ కెమెరా 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కలిసి ఉండవచ్చు. ఫ్రంట్ కెమెరాలో 16ఎంపీ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ మోడల్ నంబర్ సీపీహెచ్2621తో ఎన్‌బీటీసీ సర్టిఫికేషన్ సైట్‌లో కూడా గుర్తించారు. లిస్టింగ్ ఫోన్ మోనికర్, 5జీ కనెక్టివిటీ కలిగిన ఈ 5జీ ఫోన్ థాయిలాండ్, ఇతర గ్లోబల్ మార్కెట్‌లలో త్వరలో లాంచ్ కానుంది.