OPPO F31 5G Series : ఒప్పో F31 సిరీస్ వచ్చేసిందోచ్.. ఏకంగా 5 వేరియంట్లు.. ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతంటే?

OPPO F31 5G Series : ఒప్పో F31 సిరీస్ లాంచ్ అయింది. ఒప్పో ఒప్పో F31, ఒప్పో F31 ప్రో, ఒప్పో F31 ప్రో ప్లస్ ఫోన్లు వచ్చేశాయి..

OPPO F31 5G Series : ఒప్పో F31 సిరీస్ వచ్చేసిందోచ్.. ఏకంగా 5 వేరియంట్లు.. ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతంటే?

OPPO F31 5G Series

Updated On : September 16, 2025 / 8:09 PM IST

OPPO F31 5G Series : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఒప్పో F31 సిరీస్‌ వచ్చేసింది. భారత మార్కెట్లోకి ఒప్పో F31, ఒప్పో F31 ప్రో, ఒప్పో F31 ప్రో ప్లస్ అనే 5 మోడళ్లు ఉన్నాయి. ధర, బ్యాటరీ, డిస్‌ప్లేకి సంబంధించి ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి (OPPO F31 5G Series) లుక్కేయండి.

ధర వివరాలివే :
ఒప్పో F31 (స్టాండర్డ్ మోడల్) ధర రూ. 22వేలు
ఒప్పో F31 ప్రో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999.
ఒప్పో F31 ప్రో 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999.
ఒప్పో F31 ప్రో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999.
ఒప్పో F31 ప్రో ప్లస్ 8GB + 256GB మోడల్ ధర రూ. 32,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 34,999.

మన్నిక :
ఈ సిరీస్ మన్నికపై ఒప్పో టెస్టింగ్ చేసింది. అన్ని మోడళ్లు IP69, IP68, IP66 సర్టిఫికేట్లు కలిగి ఉంది. ఈ ఫోన్లు దుమ్ము-నిరోధకత, నీటి-నిరోధకత, ప్రమాదవశాత్తు కిందపడినా చెక్కుచెదరవు. ఈ ఫోన్‌లను ఒప్పో అన్ని వాతవరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించింది. తద్వారా రిటైలర్లు లేదా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఇతర వినియోగదారులు ఎలాంటి ఆందోళన లేకుండా వినియోగించవచ్చు.

Read Also : Realme P3 Lite 5G : భారీ బ్యాటరీతో రియల్‌మి P3 సిరీస్‌ వచ్చేసిందోచ్.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే.. త్వరపడండి..!

బ్యాటరీ :
బ్యాటరీ విషయానికి వస్తే.. ఒప్పో F31 సిరీస్ ప్రతి మోడల్ 7000mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఒప్పో ఫోన్ త్వరగా ఛార్జ్ అయ్యేందుకు ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తుంది.

డిస్‌ప్లే :

ఒప్పో F31 ప్రో ప్లస్ : క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 720 జీపీయూ కలిగి ఉంది. వాట్‌కు 60శాతం మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 24GB వరకు ర్యామ్ (12GB ఫిజికల్ + 12GB వర్చువల్), UFS 3.1 స్టోరేజీతో ఈ మోడల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ అందిస్తుంది.

ఒప్పో F31 ప్రో : మీడియాటెక్ డైమన్షిటీ 7300-ఎనర్జీ ప్రాసెసర్, మాలి-G615 జీపీయూ కలిగి ఉంది. 24GB వరకు ర్యామ్, UFS 3.1 స్టోరేజీ సపోర్టు ఇస్తుంది. థర్మల్ డిజైన్ బలంగా ఉంది. భారీ 4,363 mm² స్టీమ్ రూం, గ్రాఫైట్ షీట్లతో వస్తుంది.

ఒప్పో F31 : ఈ మోడల్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 SoCపై రన్ అవుతుంది. 21శాతం థర్మల్ సామర్థ్యాన్ని అందించే కొత్త వేపర్ చాంబర్‌ను కలిగి ఉంది.

కెమెరాలు :
ఒప్పో F31 ప్రో ప్లస్ : 50MP OIS కెమెరా + 2MP మోనోక్రోమ్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా.
ఒప్పో F31 ప్రో : 50MP OIS కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా.
ఒప్పో F31 : 50MP మెయిన్ సెన్సార్ + 2MP పోర్ట్రెయిట్ లెన్స్‌లు, 16MP సెల్ఫీ కెమెరా.