Redmi Note 14 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

Redmi Note 14 Series : భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 14 ఫోన్ డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో లాంచ్ కానుంది. ఈ సేల్ జనవరి 10 నుంచి జనవరి 15 మధ్య లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Redmi Note 14 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

Redmi Note 14 Series India Launch

Updated On : October 29, 2024 / 3:00 PM IST

Redmi Note 14 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? త్వరలో భారత మార్కెట్లోకి షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. గత సెప్టెంబర్‌లో చైనాలో రెడ్‌మి నోట్ 14 సిరీస్ ఆవిష్కరించింది. రాబోయే ఈ లైనప్‌లో బేస్, ప్రో, ప్రో ప్లస్ వేరియంట్ ఉన్నాయి. దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ హ్యాండ్‌సెట్‌లు త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ వెర్షన్లతో కొద్దిగా భిన్నమైన ఫీచర్లతో రావచ్చు. ఇండోనేషియా ఎస్‌డీపీపీఐ సర్టిఫికేషన్ సైట్‌లో వనిల్లా రెడ్‌మి నోట్ 14 5జీ గుర్తించారు. టిప్‌స్టర్ ఇప్పుడు రెడ్‌మి నోట్ 14 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ గురించి రివీల్ చేశారు.

రెడ్‌మి నోట్ 14 సిరీస్ భారత్ లాంచ్ (అంచనా) :
భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 14 ఫోన్ డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో లాంచ్ అవుతుందని నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ సేల్ జనవరి 10 నుంచి జనవరి 15 మధ్య లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ రెడ్‌మి లైనప్‌లోని 3 హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లను అందిస్తున్నాయి. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్, రెడ్‌మి నోట్ 14 ప్రోలను భారత మార్కెట్లో కూడా లాంచ్ చేయవచ్చని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న చైనీస్ వెర్షన్‌ల కన్నా భారతీయ వేరియంట్‌లు స్వల్ప మార్పులతో వస్తాయని టిప్‌స్టర్ పేర్కొన్నారు.

రెడ్‌మి నోట్ 14 సిరీస్ ఫీచర్లు :
రెడ్‌మి నోట్ 14 మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కలిగి ఉంది. అదే సమయంలో, రెడ్‌మి నోట్ 14ప్రో, రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ వరుసగా మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్ట్రా, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీలను కలిగి ఉన్నాయి. రెడ్‌మి ప్రో ప్లస్ వేరియంట్ గరిష్టంగా 16జీబీ ర్యామ్ సపోర్టు ఇస్తుంది. ఈ మూడు హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్ అందిస్తుంది. రెడ్‌మి ప్రో మోడల్స్ 6.67-అంగుళాల 120Hz 1.5K డిస్‌ప్లే కలిగి ఉంటాయి. అయితే, బేస్ మోడల్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్‌ను పొందుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. బేస్ రెడ్‌మి నోట్ 14 ఫోన్ 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది. రెడ్‌మి నోట్ 14ప్రో ట్రిపుల్ బ్యాక్ కెమెరా యూనిట్‌లో 50ఎంపీ మెయిన్ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, మరోవైపు, 50ఎంపీ మెయిన్ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50ఎంపీ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

రెడ్‌మి ప్రో మోడల్‌లు 20ఎంపీ సెల్ఫీ షూటర్‌ కలిగి ఉంటాయి. రెడ్‌మి నోట్ 14 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,110mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, రెడ్‌మి ప్రో వేరియంట్ అదే విధమైన ఛార్జింగ్‌తో 5,500mAh సెల్‌ను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 14 ప్రో+ 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?