Reliance Jio : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. ఈ రెండు ప్లాన్లతో 365 రోజుల వ్యాలిడిటీ.. ధర ఎంతో తెలుసా?
Reliance Jio : జియో కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. డేటా అవసరం లేని యూజర్లకు బెస్ట్ ప్లాన్లుగా చెప్పొచ్చు.

Reliance Jio
Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రెండు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ జియో ప్లాన్లు డేటా అవసరం లేని యూజర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఫోన్ కాల్స్, SMS మాత్రమే వినియోగించుకోవచ్చు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)సూచనల మేరకు ఈ రీఛార్జ్ ప్లాన్లను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని టెలికాం కంపెనీల్లో చౌకైన కాల్స్, SMSలతో రీఛార్జ్ ప్లాన్లను పొందొచ్చు.
రూ. 458 ఫస్ట్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1000 ఫ్రీ SMS అందిస్తోంది. వినియోగదారులు జియోసినిమా, జియోటీవీ వంటి వీడియో యాప్‌లను కూడా ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు.
డేటా అవసరం లేకుండా కాల్స్ చేయడం, SMS మాత్రమే ఇష్టపడే వారికి ఈ ప్లాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ నెట్‌వర్క్‌లోనైనా ఫ్రీ నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్ ధర రోజుకు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.
రూ. 1958 రెండో ప్లాన్ :
ఈ ప్లాన్ ఏడాది అంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 3600 ఫ్రీ SMS కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కూడా యూజర్లకు జియో సినిమా, జియో టీవీ ఫ్రీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ ధర రోజుకు రూ. 5 చొప్పున నెలకు రూ. 155కు చెల్లించాల్సి ఉంటుంది.
పాత ప్లాన్లు పనిచేయవు :
ఈ కొత్త ప్లాన్‌లతో పాటు జియో పాత రూ.479, రూ.1899 ప్లాన్‌లను నిలిపివేసింది. రూ.479 ప్లాన్ గతంలో 84 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటాను అందించగా రూ.1899 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24GB డేటాను అందించింది.
Read Also : iPhone 16 Price : ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఆపిల్ లవర్స్ ఇలా చేస్తే అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!
ఎవరికి ప్రయోజనం? :
జియో ఈ కొత్త వాయిస్-ఓన్లీ ప్లాన్‌లతో ఫోన్ కాల్స్, SMS పంపుకోవచ్చు. తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్‌లు సీనియర్ సిటిజన్లు, సాధారణ వినియోగదారులు, ఫీచర్ ఫోన్ యూజర్లు బెనిఫిట్స్ పొందొచ్చు.