JioTele OS: స్మార్ట్ టీవీలకోసం జియోటెలీ ఓఎస్.. ఫిబ్రవరి 21నుంచి అందుబాటులోకి
స్మార్ట్ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్ ను రియల్స్ జియో ఆవిష్కరించింది.

JioTele OS
JioTele OS: జియో హాట్‌స్టార్ ప్రారంభంతో రిలయన్స్ జియో ఓటీటీ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్ ను రిలయన్స్ జియో మంగళవారం ఆవిష్కరించినట్లు తెలిపింది. దీనితో తయారైన థామ్సన్, కొడక్, బీపీఎల్, జీవీసీ వంటి బ్రాండ్స్ కు చెందిన స్మార్ట్ టీవీలు ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. ఈ ఏడాదిలోనే మరిన్ని బ్రాండ్స్ చేతులు కలిపే అవకాశం ఉందని రిలయన్స్ జియో వెల్లడించింది.
సరికొత్త వినోద అనుభూతిని అందించే కొత్తతరం ప్లాట్ఫాంగా జియోటెలి ఓఎస్ ను జియో అభివర్ణించింది. ఈ విభాగంలో గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్, శాంసంగ్, టైజెన్ లతో జియోటెలి ఓఎస్ పోటీపడనుంది. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పర్సనలైజ్డ్ కంటెంట్ ను సిఫార్సు చేస్తుంది. 4కే కంటెంట్ అందించే టీవీల్లోనూ ల్యాగ్ అనే సమస్య ఉత్పన్నం కాదని, స్మూత్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని రియల్స్ జియో తెలిపింది. టీవీ ఛానెళ్లతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్, క్లౌడ్ గేమింగ్ వంటివీ లభిస్తాయి. సింగిల్ రిమోట్ తో అన్ని రకాల కంటెంట్ ను యాక్సెస్ చేయొచ్చునని రియల్స్ జియో పేర్కొంది.
కొత్త యాప్స్ కు సపోర్ట్ చేసే విధంగా, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు సాప్ట్ వేర్ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ చెబుతోంది. అయితే, కౌంటర్ పాయింట్ సెర్చ్ ప్రకారం.. భారతదేశంలో స్మార్ట్ టీవీల మార్కెట్ 1.34 కోట్ల యూనిట్ గా ఉంది. ఆదాయాలు సుమారు రూ.52వేల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఓపెన్ సేల్స్ పై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తూ బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలతో స్థానికంగా డిస్ ప్లే ల అసెంబ్లింగ్ కి ఊతం లభించింది. అంతిమంగా తయారీ సంస్థలకు ఖర్చులు 5-10శాతం ఆదా అవుతాయని పేర్కొంది.