Gold Prices Today : పసిడి ధరలు పైపైకి.. రూ.90వేలకు చేరువలో బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం ఎంతంటే?
Gold Prices Today : బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నారు. ఆల్ టైమ్ రికార్డు దిశగా పసిడి పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold And Silver Price On 19th February 2025
Gold Prices Today : బంగారం కొంటున్నారా? ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ పసిడి ధరలు పైపైకి ఎగసిపోతోంది. సరికొత్త రికార్డులతో బంగారం దూసుకుపోతోంది. ఆల్ టై రికార్డు దిశగా పసిడి పరుగులు పెడుతోంది. రూ. 90వేలకు చేరువలో బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధర మొదటిసారిగా రూ.89వేల మార్క్ దాటేసింది. ఈరోజు (ఫిబ్రవరి 19న) బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 87,800 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,450 పలుకుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 1,00,500 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. కానీ, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు వరుసగా ఈరోజు రూ. 600 నుంచి రూ. 700 మధ్య పెరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పెరుగుతున్న తరుణంలో బంగారం కొనడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. ముఖ్యంంగా పేద, మధ్యతరగతికి చెందిన కొనుగోలుదారులు బంగారు కొనుగోలు చేసేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు.
Read Also : Gold Rush : లండన్ నుంచి న్యూయార్క్‌కు బిలియన్ల బంగారం.. బ్యాంకులు ఎందుకు తరలిస్తున్నాయంటే? అసలు రీజన్ ఇదే!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లంతా పెట్టుబడులను బంగారంలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. చూస్తుంటే.. అతి త్వరలోనే పసిడి ధరలు రూ. 90 వేల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆపై లక్ష దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? :
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,450 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 1,00,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, చెన్నై నగరాల్లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,350 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా :
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,650 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,350 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో కిలో వెండి ధరలు కూడా రూ.1,08,000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.