Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌కు సెక్యూరిటీ పాచ్.. కెమెరా ఫీచర్లకు సరికొత్త అప్‌డేట్..!
Samsung Galaxy S23 Series : శాంసంగ్ నుంచి గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ అయ్యాక అద్భుతమైన కెమెరా ఫీచర్లతో జూన్ 2023 సెక్యూరిటీ పాచ్ రిలీజ్ అయింది.

Samsung Galaxy S23 Series Gets June 2023 Security Patch With Several Camera Improvements
Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 5.1 స్కిన్‌తో కూడిన (Samsung Galaxy S23) సిరీస్ 2023 ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు జూన్ 2023 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను అందిస్తోంది. లేటెస్ట్ ఫర్మ్‌వేర్ కెమెరా యాప్‌కు 2x పోర్ట్రెయిట్ ఆప్షన్ అందిస్తుంది. ఆటో ఫోకస్ సమస్యలను కూడా ఫిక్స్ చేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా అనేక స్టేబుల్ డెవలపమెంట్స్, బగ్ సమస్యలను ఫిక్స్ చేసినట్టు నివేదిక తెలిపింది. కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్‌లలో అర్హత పొందిన శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అప్‌డేట్‌ను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త సెక్యూరిటీ పాచ్ అప్‌డేట్ 2.2GB ఫైల్ సైజ్ కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S23 అప్‌డేట్ చేంజ్‌లాగ్ :
SamMobile నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S23, Galaxy S23+, Galaxy S23 Ultra ఫర్మ్‌వేర్ వెర్షన్ S91xBXXU2AWF1తో అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్‌లలో హ్యాండ్‌సెట్‌ల కోసం ఈ కొత్త అప్‌డేట్ రిలీజ్ అయింది. ఈ సెక్యూరిటీ అప్‌డేట్ జూన్ 2023 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ని అందిస్తుంది.
సాధారణ బగ్ ఫిక్స్, వన్ UI మెరుగుదలలు మాత్రమే కాకుండా కెమెరా యాప్ పోర్ట్రెయిట్ మోడ్‌లో కొత్త 2x జూమ్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ఫైల్ సైజు 2.2GB వరకు ఉంటుంది ఆటో ఫోకస్ సమస్యలను పరిష్కరిస్తుంది. నైట్ మోడ్ ఫీచర్‌కు మార్చేస్తుంది. గెలాక్సీ S23 సిరీస్ మోడల్‌లు హాప్టిక్స్‌లో కూడా సూక్ష్మమైన మార్పులతో వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కంపెనీ గుర్తించిన కెమెరా బ్లర్ సమస్యకు ఈ అప్‌డేట్‌లో అనేక పరిష్కారాలు ఉంటాయి.

Samsung Galaxy S23 Series Gets June 2023 Security Patch With Several Camera Improvements
నివేదిక ప్రకారం.. అర్హత పొందిన Galaxy S23, Galaxy S23+, Galaxy S23 అల్ట్రా యూనిట్‌లకు అప్‌డేట్ ఆటోమాటిక్‌గా వస్తుంది. అయితే, పైన పేర్కొన్న ప్రాంతాల్లోని వినియోగదారులు Settings > Software Update> డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మాన్యువల్‌గా అప్‌డేట్ చెక్ చేయవచ్చు. వినియోగదారులు Wi-Fi నెట్‌వర్క్, ఛార్జర్‌కు కనెక్ట్ చేసినప్పుడు వారి ఫోన్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా నివేదిక సూచించింది.
రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు ఈ కనెక్టవిటీ వచ్చే అవకాశం ఉంది. భారత మార్కెట్లో గత ఫిబ్రవరిలో Galaxy S23 సిరీస్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా లాంచ్ అయింది. ఈ సిరీస్ ఫోన్ ప్రారంభ ధర రూ. బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 74,999గా ఉంటుంది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, స్పోర్ట్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేల వెర్షన్‌తో రన్ అవుతుంది. ఇక, ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్‌లు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి.