Samsung: శాంసంగ్ నుంచి కేక పెట్టించే ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యే తేదీ ఇదే!

కొందరు విశ్లేషకులు ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా వివరించారు.

Samsung: శాంసంగ్ నుంచి కేక పెట్టించే ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యే తేదీ ఇదే!

Updated On : April 8, 2025 / 8:10 AM IST

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. గెలాక్సీ ఎస్ 25తో పాటు ఎస్ 25+, ఎస్ 25 అల్ట్రా మోడల్స్‌ మార్కెట్లో ఉన్నాయి. ఇదే సిరీస్‌లో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ వేరియంట్‌ విడుదల కానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరిలో శాంసంగ్‌ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌లోనే విడుదల అవుతుందని ముందుగా భావించినప్పటికీ అది వాయిదా పడింది. తాజాగా లాంచ్‌ తేదీపై మరో ప్రచారం జరుగుతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మే 13న విడుదల అవుతుందని లీకులు వస్తున్నాయి. ఈ ఫోన్ ధర, దాని చిప్‌సెట్, రామ్ వివరాల గురించి ఇప్పటికే లీకులు వచ్చాయి. కొందరు విశ్లేషకులు ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా వివరించారు.

ఫీచర్లు
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ కేవలం 5.84 మి.మీ మందంతో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇది శాంసంగ్ లైనప్‌లోనే అతి సన్నని ఫోన్‌. శాంసంగ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌లో టైటానియం ఫ్రేమ్‌ను వాడినట్లు తెలుస్తోంది. టైటానియం ఐసీ బ్లూ, టైటానియం జెట్ బ్లాక్, టైటానియం సిల్వర్ వేరియంట్లలో ఇది వస్తోంది.

గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ చిప్ ఆండ్రాయిడ్ డివైజ్‌ల అన్నింటికంటే ఫాస్టెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ను అందిస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, కంటెంట్ వినియోగం విషయంలో ఎంతో మెరుగైన పెర్ఫార్మెన్స్‌ అందించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్‌తో వస్తోంది.

గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండొచ్చు. దీనికి ట్రిపుల్-లెన్స్ వ్యవస్థ ఉండకపోవచ్చు. గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది.

ధరలు
Galaxy S25 Edge (256GB): రూ. 1,11,000 – రూ. 1,20,400 మధ్య ఉండొచ్చు

Galaxy S25 Edge (512GB): రూ. 1,20,400 – రూ. 1,29,600 మధ్య ఉండొచ్చు