Samsung Galaxy S25 : ఈ నెల 22న శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ వచ్చేస్తోంది.. భారత ధరల లీక్ వివరాలివే!
Samsung Galaxy S25 : శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది. శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది.

Samsung Galaxy S25 launch
Samsung Galaxy S25 Launch : శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ జనవరి 22న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. శాంసంగ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద టెక్ ఈవెంట్‌లో కనీసం 3 ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను లాంచ్ చేయనుంది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఉన్నాయి. కొత్త శాంసంగ్ గెలాక్సీ S సిరీస్ ధర భారీగా ఉండనున్నట్టు కొన్ని నివేదికలు పేర్కొంటున్నప్పటికీ, కొత్త ఫోన్లను పాత ధరలకే ప్రవేశపెట్టవచ్చునని లీక్ డేటా సూచిస్తోంది.
రాబోయే ఫోన్‌లను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న చాలా మంది వినియోగదారులను గందరగోళానికి గురిచేసింది. శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది. భారత మార్కెట్లో రాబోయే అన్ని శాంసంగ్ మోడల్స్ ధరలు లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ మోడల్స్ భారతీయ ధరలను టిప్‌స్టర్ తరుణ్ వాట్స్ లీక్ చేసింది. భారతీయ మార్కెట్ కోసం రాబోయే అన్ని మోడల్‌ల లీక్ అయిన ధరలను ఓసారి పరిశీలించండి.
లీక్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 84,999తో వస్తుంది. కంపెనీ 12జీబీ + 512జీబీ మోడల్‌ను కూడా ఆఫర్ చేస్తుందని అంచనా. ఈ మోడల్ ధర రూ. 94,999 నుంచి ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,04,999గా ఉండవచ్చు.

Samsung Galaxy S25
512జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ. 1,14,999కి విక్రయించవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,34,999తో విక్రయించనుంది. 16జీబీ+ 512జీబీ మోడల్ ధర రూ. 1,44,999 అయితే 1టీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ. 1,64,999కి అందించవచ్చని లీక్ సూచిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24, S24+, S24 అల్ట్రా ఇండియా ధరలివే :
- శాంసంగ్ గెలాక్సీ S24 ధర రూ. 79,999 (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ)
- గెలాక్సీ ఎస్24+ ధర రూ. 99,999 నుంచి ప్రారంభమైంది (12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ)
- గెలాక్సీ ఎస్24 అల్ట్రా రూ. 1,29,999 (+125జీబీ ర్యామ్ ) వద్ద లాంచ్ అయింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలను పెంచుతోందా? :
రాబోయే మోడళ్లతో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధరలను పెంచే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్‌తో పోల్చితే.. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర రూ. 5వేలు పెరగవచ్చని పేర్కొంది. దీని కారణంగా, స్టాండర్డ్ మోడల్ ధర దాదాపు రూ. 85వేలు, ప్లస్ మోడల్ ధర మునుపటి జనరేషన్ ఫోన్లతో పోలిస్తే రూ. 1 లక్ష కన్నా ఎక్కువగా ఉంటుంది.
Xclusive: IQOO NEO 10R 5G (India)
I2221
6.78″ AMOLED 144hz
8s Gen 3
8GB+256GB, 12GB+256GB
50MP Sony LYT-600, 8MP wide, 16MP front
6400 mAh / 80W
Blue white Slice, Lunar TitaniumUnder 30K
Feb 2025#IQOO #IQOONeo10R #IQQNEO10R5G— Paras Guglani (@passionategeekz) January 20, 2025
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను గెలాక్సీ ఎస్ 25 ప్లస్, అల్ట్రాతో పోల్చినట్లయితే.. శాంసంగ్ తక్కువ ధరలకు అందించనుంది. ఏదేమైనప్పటికీ, కంపెనీ పాత ధరలను అలాగే ఉంచితే.. కొత్త ఫోన్లపై మెరుగైన విక్రయాలను అందించే అవకాశం ఉంది. అలాగే, ప్రామాణిక S25 మోడల్ ధర ఐఫోన్ 16 కన్నా ఎక్కువగా ఉంటుందని లీక్ సూచిస్తుంది.
కానీ, ఈ శాంసంగ్ ఫోన్ అధికారిక ధరలు కావని గమనించాలి. అలాగే, శాంసంగ్ రాబోయే గెలాక్సీ S25 సిరీస్‌తో చిప్‌సెట్, ఏఐ ఫీచర్లు, ఛార్జింగ్, డిజైన్, కెమెరా విభాగంలో కొన్ని అప్‌గ్రేడ్‌లతో రానుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు శాంసంగ్ కొత్త మోడళ్ల ధరలను పెంచుతుందా లేదా పాత ధరలను అలాగే ఉంచుతుందా అనేది చూడాలి.
Read Also : iQOO Neo 10R 5G : ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ టైమ్‌లైన్, ధర వివరాలివే..!