Tecno Phantom V Flip : టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ మడతబెట్టే ఫోన్ ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంతో తెలుసా?
Tecno Phantom V Flip : కొత్త టెక్నో ఫాంటమ్ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేసింది. టెక్నో ఫాంటమ్ ఫ్లిప్ 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు.

Tecno Phantom V Flip 5G With 6.9-inch AMOLED Display Launched in India
Tecno Phantom V Flip : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ (Tecno) ఫాంటమ్ V ఫ్లిప్ 5G ఫోన్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో టెక్నో ఫాంటమ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లలో ఇది రెండవది. ఇప్పటికే, కంపెనీ మొదటి ఫోల్డబుల్ ‘టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్’ (Tecno Phantom V Fold) ఈ ఏడాది ప్రారంభంలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 (Mobile World Congress Event) ఈవెంట్‌లో ఆవిష్కరించింది.
ఆ తరువాత ఏప్రిల్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు, ఫాంటమ్ V ఫ్లిప్ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ వివరాలు గతంలో అనేక సార్లు లీకయ్యాయి. ఇప్పుడు 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ వృత్తాకార ఔటర్ డిస్‌ప్లేతో పాటు బ్యాక్ కెమెరా యూనిట్ కలిగి ఉంది.
టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G ధర :
టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సింగిల్ 8GB RAM + 256GB స్టోరేజీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 49,999గా నిర్ణయించింది. ఫోల్డబుల్ అమెజాన్ (Amazon)లో అక్టోబర్ 1న మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ త్వరలో ఇతర దేశాలలో కూడా లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.
టెక్నో ఫాంటమ్ V ఫ్లిప్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
6.9-అంగుళాల ఫుల్-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) ఫ్లెక్సిబుల్ AMOLED ఇంటర్నల్ డిస్‌ప్లేతో, ఫాంటమ్ V ఫ్లిప్ 5G 1000నిట్‌ల గరిష్ట స్థాయితో వస్తుంది. ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో వృత్తాకార AMOLED కవర్ ప్యానెల్ సారూప్య ఫీచర్లతో 1.32 అంగుళాలు కలిగి ఉంటుంది. వినియోగదారులు కవర్ స్క్రీన్ నుంచి మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వగలరు.

Tecno Phantom V Flip 5G With 6.9-inch AMOLED Display Launched in India
క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఆర్మ్ మాలి-G77 GPUతో MediaTek డైమెన్సిటీ 8050 SoC ద్వారా ఆధారితమైనది. 8GB LPDDR4X RAMతో వర్చువల్‌గా 16GB వరకు పొడిగించవచ్చు. 256GB UFS 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 13.5తో వస్తుంది. రెండు ఏళ్ల OS అప్‌డేట్‌లు, 3 ఏళ్ల భద్రతా ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.
ఫాంటమ్ V ఫ్లిప్ బ్యాక్ కెమెరా యూనిట్‌లో 64MP ప్రైమరీ సెన్సార్, వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 13MP సెన్సార్ ఉన్నాయి. క్వాడ్ ఫ్లాష్‌లైట్ యూనిట్‌తో కలిసి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ప్రైమరీ డిస్‌ప్లే ఎగువన సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌లో ఉంది. 32MP సెన్సార్‌ను కలిగి ఉంది.
5G, Wi-Fi 6, NFC, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో పాటు, ఫాంటమ్ V ఫ్లిప్ 5G కూడా ఎల్లా GPT 3.0కి సపోర్టు ఇస్తుంది. ఫోన్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఓపెన్ హ్యాండ్‌సెట్ 171.72mm x 74.05mm x 6.95mm కలిగి ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు 88.77mm x 74.05mm x 14.95mm పరిమాణంలో ఉంటుంది.