Xiaomi Phones : ఈ రెండు షావోమీ స్మార్ట్‌ఫోన్లలో జియో 5G సపోర్టు చేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!
Xiaomi Phones : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 100 కన్నా ఎక్కువ నగరాల్లో Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

These two Xiaomi phones do not support Jio 5G _ Report
Xiaomi Phones : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ 5G సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 100 కన్నా ఎక్కువ నగరాల్లో Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. Jio 5G సర్వీసులను పొందాలంటే తప్పనిసరిగా 5G సపోర్టుతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. ప్రస్తుతానికి Samsung, Realme, Xiaomi సహా దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు 5G సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. రెండు Xiaomi ఫోన్‌లు Jio 5Gకి సపోర్టు ఇవ్వవు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు Xiaomi Mi 10, Mi 10i మోడల్స్. ఎందుకంటే ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 5G స్టాండలోన్ లేదా 5G SAకి సపోర్టు అందించవు. Airtel 5G సర్వీసులు మాత్రమే ఈ రెండు ఫోన్లలో పని చేస్తుంది. ఇటీవలే Xiaomi Mi 10 ఫోన్ లాంచ్ చేసింది.
MI 10i వరుసగా 2020, 2021లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ప్రీమియం ధరల విభాగంలోకి వస్తాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం Mi 10 ధర రూ. 31,999 కాగా, Mi 10i ఫోన్ ధర రూ. 21,999 నుంచి అందుబాటులో ఉంది. Mi 10i Qualcomm Snapdragon 750 5g ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

These two Xiaomi phones do not support Jio 5G
Mi 10 Qualcomm Snapdragon 865 చిప్‌సెట్‌తో వస్తుంది. Airtel 5G నాన్-స్టాండలోన్ వెర్షన్ కలిగి ఉంది. 5G విస్తరణలో స్వతంత్ర 5G ఒకటిగా ఉంది. నెట్‌వర్క్ సర్వీసులు ఎండ్-టు-ఎండ్ కోర్ 5G నెట్‌వర్క్ ద్వారా అందిస్తాయి. నాన్-స్టాండలోన్ 5Gలో 5G రేడియో సిగ్నల్, ఇప్పటికే ఉన్న 4G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అందిస్తుంటాయి. స్వతంత్ర 5G నాన్-స్టాండలోన్ 5G కన్నా వేగవంతమైనది.
Jio 5Gకి సపోర్టు ఇచ్చే షావోమీ ఫోన్‌ల జాబితా :
Xiaomi Mi 10, Mi 10i మినహా, Jio True 5G అన్ని Xiaomi స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లు Mi 11 Ultra 5G, Xiaomi 12 Pro 5G, Xiaomi 11T Pro 5G, Redmi Note 11 Pro 5G, Xiaomi 11 Lite NE 5G, Redmi Note 11T 5G, Redmi 11 Prime 5G, Redmi Note 10G, 5G Mi1G, 10 11X Pro 5G, Redmi K50i 5G, Xiaomi 11i 5G, Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G వంటి స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..