TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? మరో చైనా యాప్ తెగ డౌన్‌లోడ్ చేస్తున్నారట..!
TikTok Ban : అమెరికాలో మరో చైనీస్ యాప్ డౌన్‌లోడ్‌లు భారీగా పెరిగాయి. దీని పేరు జియాహోంగ్షు.. దీనిని 'లిటిల్ రెడ్ బుక్' అని కూడా పిలుస్తారు.

TikTok Ban
TikTok Ban : అగ్రరాజ్యం అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్ కానుందా? కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టిక్‌టాక్‌ను అమెరికాలో కూడా నిషేధానికి గురికానుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో టిక్‌టాక్‌పై ఈ కొత్త నిషేధం అమలులోకి రావచ్చు. అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 19న అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిలియన్ల కొద్దీ అమెరికన్ వినియోగదారులు టిక్‌టాక్ ప్రత్యామ్నాయ ఆప్షన్ల కోసం వెతకడం ప్రారంభించారు.
Read Also : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. ఈ దొంగ రూ. కోటి డిమాండ్ చేశాడట..!
నివేదికల ప్రకారం.. అమెరికాలో మరో చైనీస్ యాప్ డౌన్‌లోడ్‌లు భారీగా పెరిగాయి. దీని పేరు జియాహోంగ్షు.. దీనిని ‘లిటిల్ రెడ్ బుక్’ అని కూడా పిలుస్తారు. నివేదికల ప్రకారం.. ఈ యాప్ ఇటీవల ఆపిల్ యాప్ స్టోర్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న సమయంలో ఈ యాప్ బాగా పాపులర్ అయింది. ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టయిల్‌కి సంబంధించిన ఆకర్షణీయమైన కంటెంట్ (Xiaohongshu)లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకూ చైనాలో ఈ యాప్ 300 మిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకుంది.
టిక్‌టాక్‌లో అమెరికాకు ఏం కావాలి? :
భారత మాదిరిగా అమెరికా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తోంది. నివేదికల ప్రకారం.. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌కు అమెరికా రెండు మార్గాలను అందించింది. మొదటగా అమెరికాలో తన వ్యాపారాన్ని మరొకరికి విక్రయించాలి. రెండవ మార్గం జనవరి 19, 2025 నాటికి అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను నిలిపివేయాలి. బైట్‌డాన్స్(ByteDance) అమెరికాలో ఈ టిక్‌టాక్ విక్రయించేందుకు ప్రయత్నిస్తే.. అందుకు 100 రోజుల వరకు సమయం పడుతుంది.
మస్క్ టిక్‌టాక్ కొనుగోలు చేస్తారా? :
ఎలన్ మస్క్ అమెరికాలో టిక్‌టాక్ కొనుగోలు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మస్క్ ఈ బిజినెస్ కొనుగోలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. గతంలోనే ట్విట్టర్‌ని కొనుగోలు చేసి మస్క్ కంపెనీ పేరును ఏకంగా ఎక్స్‌గా మార్చాడు. అదే టిక్‌టాక్‌ను మస్క్ కొనుగోలు చేస్తే.. దాన్ని ఎక్స్‌తో ఇంటిగ్రేట్ చేస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, టిక్‌టాక్ ప్రతినిధి మస్క్‌కు అమెరికన్ బిజినెస్ విక్రయించే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.
Read Also : Realme 14 Pro 5G : టైటాన్ బ్యాటరీతో రియల్‌మి 14ప్రో 5జీ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!