Top 5 Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Top 5 Smartphones 2024 : 108ఎంపీ కెమెరా, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగిన షావోమీ రెడ్‌మి నోట్ 13 5జీ లాంచ్‌తో రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Top 5 Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Top 5 best phones to buy under Rs 20k, Redmi Note 13 5G, OnePlus Nord CE 3 Lite 5G

Updated On : January 7, 2024 / 7:22 PM IST

Top 5 Smartphones 2024 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2024లో రూ. 20వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్, ఐక్యూ, రియల్‌మి, శాంసంగ్ వంటి అనేక టాప్ కంపెనీలు ఇప్పటికే ఇదే ధర పరిధిలో అనేక బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ. 20వేల లోపు అయితే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

రెడ్‌మి నోట్ 13 5జీ :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ మాలి-జీ57 జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. గత జనరేషన్ ఫోన్లతో పోలిస్తే.. కెమెరాల పరంగా స్మార్ట్‌ఫోన్ పెద్ద అప్‌గ్రేడ్‌ను పొందింది. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ ఇప్పుడు 108ఎంపీ ఎఫ్/1.7 ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Read Also : Best phones in India 2024 : ఈ జనవరిలో రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

రెడ్‌మి నోట్ 13 5జీ కూడా అదే 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. బాక్స్ లోపల అందుబాటులో ఉన్న 33డబ్ల్యూ ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు సపోర్టుతో 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. షావోమీ నుంచి మిడ్-రేంజ్ డివైజ్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వి5 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఐపీ54 స్ప్లాష్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్‌ను పొందింది.

Top 5 best phones to buy under Rs 20k, Redmi Note 13 5G, OnePlus Nord CE 3 Lite 5G

Top 5 best phones  

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో వస్తుంది. 8జీబీ వరకు ర్యామ్ 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత ఆక్సిజన్‌ఓఎస్ 13తో ఫోన్ రన్ అవుతుంది.

200శాతం అల్ట్రా-వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కెమెరా సిస్టమ్‌లో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

Top 5 best phones to buy under Rs 20k, Redmi Note 13 5G, OnePlus Nord CE 3 Lite 5G

Top 5 best phones to buy under Rs 20k 

రియల్‌మి 11 5జీ :
రియల్‌మి 11 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రియల్‌మి యూఐ 4.0తో డ్యూయల్ సిమ్ (నానో) సెటప్‌తో పనిచేస్తుంది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) శాంసంగ్ అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో పాటు 8జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. రియల్‌మి 11 5జీ బ్యాక్ సైడ్ 2ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు ఎఫ్/1.75 ఎపర్చర్‌తో 108ఎంపీ శాంసంగ్ ఐఎస్ఓ‌సెల్ హెచ్ఎం6 ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ప్రదర్శిస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్‌ల వంటి ఫ్రంట్ ఫేసింగ్ క్యాప్చర్‌ల కోసం ఎఫ్/2.45 ఎపర్చర్‌తో కూడిన 16ఎంపీ కెమెరా అందిస్తుంది. ఈ డివైజ్ గణనీయమైన 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 67డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తుంది. బ్యాటరీని 17 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతానికి రీఛార్జ్ చేయగలదు.

శాంసంగ్ ఎం34 :
శాంసంగ్ గెలాక్సీ ఎం34 మోడల్ 6.6-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫుల్-హెచ్‌డీ+ రిజల్యూషన్ (1,080×2,408 పిక్సెల్‌లు), 1,000నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ 5ఎన్ఎమ్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.

గరిష్టంగా 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇందులో స్టేబుల్ షాట్‌ల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో పాటు థర్డ్ సెన్సార్ కూడా ఉంది.

ఐక్యూ జెడ్7ఎస్ 5జీ :
2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన ఫన్‌టచ్ ఓఎస్ 13తో ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. కెమెరా సెటప్ పరంగా ఐక్యూ జెడ్7ఎస్ 5జీ మోడల్ 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ఎస్ఓసీ, అడ్రినో 619ఎల్ జీపీయూ ఉన్నాయి. 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి 1టీబీ వరకు విస్తరించవచ్చు.

Read Also : Samsung Galaxy S23 Series Price : ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఏకంగా రూ.10వేలు తగ్గింపు.. గెలాక్సీ S24 కోసం ఆగాలా? వద్దా?