NPCI New Guidelines : UPI కొత్త రూల్స్.. ఇకపై యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు..!

NPCI New Guidelines : యూపీఐ యూజర్లు ఇకపై రోజులో 50 సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేయలేరు.. NPCI కొత్త మార్గదర్శకాలివే..

NPCI New Guidelines : UPI కొత్త రూల్స్.. ఇకపై యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు..!

NPCI New Guidelines

Updated On : August 9, 2025 / 10:32 AM IST

NPCI New Guidelines : దేశంలో యూపీఐ వాడకం బాగా పెరిగిపోయింది. అన్నింటికి యూపీఐనే.. ఏ డిజిటల్ పేమెంట్ చేయాలన్నా యూపీఐ ద్వారానే తెగ (NPCI New Guidelines) వాడేస్తున్నారు. యూటీలిటీ బిల్లుల దగ్గర నుంచి కిరాణ సరుకుల వరకు అన్నింటికి ఇప్పుడు యూపీఐపైనే ఆధారపడుతున్నారు.

అంతగా యూపీఐకి డిమాండ్ పెరిగింది. భారత్‌లో డిజిటల్ లావాదేవీల సంఖ్య వేగంగా వృద్ధి చెందుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారానే ఎక్కువ పేమెంట్లు జరుగుతున్నాయి. యూపీఐ వాడకం భారీగా పెరగడంతో యూపీఐ పేమెంట్ల సమయంలో తీవ్ర అంతరాయాలు తలెత్తుతున్నాయి.

ఇటీవలి అంతరాయాల తర్వాత యూపీఐ సేవల స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త పరిమితులను ప్రవేశపెట్టింది. ఇటీవలి నెలల్లో యూపీఐ సేవలు తరచుగా ఊహించని విధంగా నిలిచిపోతున్నాయి. ఎక్కువ మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

Read Also : UPI Payments : యూజర్లకు బిగ్ అలర్ట్.. UPI పేమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే? NPCI వన్‌షాట్ ఆన్సర్..!

ఇలాంటి అంతరాయాలతో లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ మెరుగుపరిచేందుకు NPCI కొత్త పరిమితులను విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బ్యాలెన్స్ చెకింగ్ లిమిట్ విధించింది. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

బ్యాలెన్స్ చెక్ లిమిట్ : ఒక్కో యాప్‌కు 50 సార్లు :

  •  యూపీఐ యూజర్లు ఇప్పుడు ఒకే UPI యాప్‌లో రోజుకు 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయగలరు.
  •  గతంలో బ్యాలెన్స్ చెకింగ్‌లపై ఎలాంటి పరిమితి లేదు. కానీ, ఆగస్టు 1 నుంచి కొత్త లిమిట్ అమల్లోకి వచ్చింది.
  •  ఒక యూజర్ రెండు వేర్వేరు UPI యాప్‌లను వాడితే.. వారు ఒక్కో యాప్‌కు 50 సార్లు తమ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు.
  • రోజుకు మొత్తం 100 బ్యాలెన్స్ చెకింగ్ చేయవచ్చు.

బ్యాంక్ అకౌంట్ లింక్ చెకింగ్ : రోజుకు 25 సార్లు :

  •  వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌కు ఏ బ్యాంక్ అకౌంట్లు లింక్ అయ్యాయో రోజుకు 25 సార్లు మాత్రమే వెరిఫై చేసేందుకు అనుమతి ఉంటుంది.
  •  బ్యాంకును ఎంచుకుని రిక్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ చెక్ చేయవచ్చు.
  • ఇంతకు ముందు, ఈ ఫంక్షన్‌పై ఎలాంటి పరిమితి లేదు.
  • లావాదేవీ స్టేటస్ చెకింగ్స్ సర్వీసు ప్రొవైడర్లకు పరిమితం.
  •  పేమెంట్ ఆలస్యం లేదా అనిశ్చితి సందర్భాలలో అధీకృత పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు (Google Pay, PhonePe, Paytm) మాత్రమే లావాదేవీ స్టేటస్ చెక్ చేయగలరు.
  •  మొత్తం UPI సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ చెకింగ్ పరిమితం చేసింది ఎన్‌పీసీఐ.