Vivo Drone Camera Phone : గాల్లో ఎగిరే వివో డ్రోన్ కెమెరా ఫోన్ వచ్చేస్తోంది.. వరల్డ్ ఫస్ట్ డ్రోన్ కెమెరా 5G ఫోన్ ఇదే.. అద్భుతమైన ఫీచర్లు.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
Vivo Drone Camera Phone : గాల్లో ఎగిరే డ్రోన్ కెమెరా ఫోన్ ఎప్పుడైనా చూశారా? వరల్డ్ ఫస్ట్ డ్రోన్ కెమెరా 5G ఫోన్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. రాబోయే ఈ డ్రోన్ కెమెరా ఫోన్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..

Vivo Drone Camera Phone _ 200MP Worlds First Drone Camera Phone
Vivo Drone Camera Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి వరల్డ్ ఫస్ట్ డ్రోన్ కెమెరా ఫోన్ 2023 వచ్చేస్తోంది. వివో డ్రోన్ కెమెరా (Vivo Drone Camera Phone) లాంచ్ డేట్ ఎప్పుడు? ఫుల్ స్పెషిఫికేషన్ల గురించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. రాబోయే వివో డ్రోన్ కెమెరా ఫోన్ అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలువనుంది. త్వరలో లాంచ్ కానున్న ఈ 5G సపోర్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఫోన్ లోని డ్రోన్ కెమెరా గాల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలు తీస్తుంది. వీడియోలు క్యాప్చర్ చేయగలదు. డ్రోన్ మాదిరిగానే ఈ ఫోన్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఈ డ్రోన్ కెమెరాలో నాలుగు ఫ్యాన్లు ఉంటాయి. ఏరియల్ వ్యూలో మీకు నచ్చిన విధంగా ఫొటోలను తీసుకోవచ్చు. అయితే, ఈ ఫ్లయింగ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ అనేక దేశాల్లో ముందుగా లాంచ్ కానుంది. ఈ డివైజ్‌లో పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఇతర ఫీచర్‌లు ఏమి ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

Vivo Drone Camera Phone _ 200MP Worlds First Drone Camera Phone
200MP డ్రోన్ కెమెరా ఫోన్ :
Vivo డ్రోన్ కెమెరా ఫోన్ 2023 అతి త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే లీకైన ఫోన్ ఫీచర్లను చూడవచ్చు. వివో డ్రోన్ కెమెరా ఫోన్ 2023 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా రానుంది. చాలా అద్భుతమైన ఫీచర్లతో రానుంది. ఇందులో భారీ స్టోరేజ్, పెద్ద ర్యామ్ కూడా ఉండనుంది. అలాగే, ఈ మొబైల్‌లో అద్భుతమైన కెమెరా, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. వివో డ్రోన్ కెమెరా ఫోన్ 2023 డివైజ్‌లో 200MP + 32MP + 16 MP క్వాడ్ కెమెరా, 64MP ఫ్రంట్, 12GB RAM, 6900mAh బ్యాటరీ వంటి అనేక ఫీచర్లతో రానుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీ, ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, ముఖ్య ఫీచర్లు ఏమి ఉండొచ్చు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
Vivo డ్రోన్ కెమెరా ఫోన్ 2023 లాంచ్ తేదీ ఇదిగో :
భారత మార్కెట్లో వివో డ్రోన్ కెమెరా ఫోన్ స్మార్ట్‌ఫోన్ 15 ఆగస్టు 2023న లాంచ్ కానుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి అనేక మార్పులు ఉండవచ్చు. ఏ దేశంలో వివో డ్రోన్ కెమెరా ఫోన్ ఎప్పుడు లాంచ్ అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

Vivo Drone Camera Phone _ 200MP Worlds First Drone Camera Phone
వివో డ్రోన్ కెమెరా ఫోన్ ఫీచర్లు & స్పెసిఫికేషన్‌లు ఇవే :
స్టేటస్ : లోకల్ మొబైల్ మార్కెట్‌లో అందుబాటులో లేదు.
నెట్‌వర్క్ టెక్నాలజీ : GSM / CDMA / HSPA / LTE / 5G.
SIM : డ్యూయల్ నానో-సిమ్ సపోర్టు
Display : 7.1 అంగుళాల సూపర్ AMOLED, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ద్వారా ప్రొటెక్షన్
Processor : స్నాప్‌డ్రాగన్ 888
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 12OS
మెమరీ : 12GB RAM, 256/512GB ROM
కెమెరా : క్వాడ్ 200MP + 32MP + 16MP బ్యాక్ కెమెరాలు, 64MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ : లి-పాలిమర్ 6900 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ

Vivo Drone Camera Phone _ 200MP Worlds First Drone Camera Phone
సెన్సార్ : ఫింగర్‌ప్రింట్, Face ID, యాక్సిలరోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్, బారోమీటర్.
* బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ (55W క్విక్ ఛార్జ్)
* వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు
* USB 4.0
* IP69 సర్టిఫైడ్
* ఆడియో జాక్ : 3.5mm
Vivo డ్రోన్ కెమెరా ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?:
వివో డ్రోన్ కెమెరా ఫోన్ ధర భారత వినియోగదారులకు రూ.85,500గా ఉండవచ్చు. వచ్చే ఆగస్టు 2023లో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇతర దేశాల్లో Vivo 5G స్మార్ట్‌ఫోన్ 2023ని ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియాలంటే అప్పటివరకూ వేచి చూడాల్సిందే.