Vivo X Fold 3 Pro : వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంతో తెలుసా?

Vivo X Fold 3 Pro Sale : అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షించే డిజైన్‌తో వివో లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. వివో మడతబెట్టే ఫోన్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Vivo X Fold 3 Pro : వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంతో తెలుసా?

Vivo X Fold 3 Pro goes on sale in India ( Image Source : Google )

Vivo X Fold 3 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో సేల్ మొదలైంది. జూన్ 13 నుంచి భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో అత్యంత సన్నగా ఉండే ఈ మడతబెట్టే ఫోన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5, వన్‌ప్లస్ ఓపెన్ మోడల్‌కు పోటీదారుగా నిలిచింది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో కెమెరా, డిస్‌ప్లే ఫోకస్‌తో విభిన్నంగా ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షించే డిజైన్‌తో వివో లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. వివో మడతబెట్టే ఫోన్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : BMW R 1300 GS : బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త R 1300 జీఎస్ బైక్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో : భారత్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో 256జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ మోడల్‌కు రూ. 1,59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్‌లు అందుబాటులో లేవు. ఈ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్‌లకు రూ. 15వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌లు, రూ. 10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో స్పెసిఫికేషన్‌లు :
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అంతేకాదు.. అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లతో వస్తుంది. పెద్ద 8.03-అంగుళాల 2కె ఈ7 అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, 4,500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10కి సపోర్టు ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. రెండు స్క్రీన్‌లు అల్ట్రా-థిన్ గ్లాస్ (UTG), ఆర్మర్ గ్లాస్ కోటింగ్‌తో ప్రొటెక్ట్ అవుతాయి.

హుడ్ కింద, పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్ 1టీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. మెరుగైన కెమెరా పనితీరుతో ఫోన్ వివో కస్టమైజడ్ V3 ఇమేజింగ్ చిప్‌ను కూడా కలిగి ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో మల్టీఫేస్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64ఎంపీ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా కలిగి ఉంది. లోపల బయట స్ర్కీన్లలో 32ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, NavIC, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో సహా విస్తృతంగా ఉన్నాయి. ఐపీఎక్స్8 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు 3డీ అల్ట్రాసోనిక్ డ్యూయల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేషియల్ రికగ్నిషన్‌తో సెక్యూరిటీ ఫీచర్లు పటిష్టంగా ఉంటాయి.

వీటన్నింటికీ శక్తినిచ్చే 5,700mAh బ్యాటరీ 100డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రోజంతా కనెక్ట్ అయి ఉండొచ్చు. ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో తేలికపాటి కార్బన్ ఫైబర్ కీ కూడా తీసుకొచ్చింది. బ్యాంకు ఆఫర్లలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్ హోల్డర్‌లకు భారీగా తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లతో సహా ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్‌లను అందిస్తుంది.

Read Also : Flipkart Mega Bonanza Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్స్.. ఈ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు!