Vivo X90 Pro Series : అద్భుతమైన ఫీచర్లతో వివో x90 సిరీస్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Vivo X90 Pro Series : భారత మార్కెట్లో ఎట్టకేలకు వివో నుంచి Vivo X90 సిరీస్ ఫోన్ వచ్చేసింది. వివో X90, వివో X90 ప్రో అనే రెండు వెర్షన్లను రిలీజ్ చేసింది.

Vivo X90 Pro Series : అద్భుతమైన ఫీచర్లతో వివో x90 సిరీస్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Vivo X90 Pro, Vivo X90 launched in India, price starts at 59,999

Updated On : April 26, 2023 / 5:38 PM IST

Vivo X90 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్‌‌ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి ఎట్టకేలకు భారత మార్కెట్లో (Vivo X90) సిరీస్ వచ్చేసింది. Vivo X80 సిరీస్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo X90, Vivo X90 ప్రోలను లాంచ్ చేసింది. ముందుగా.. Vivo X90 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసిన వివో.. కొన్ని నెలల తర్వాత భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లలో అదనంగా మరో వేరియంట్‌ (Vivo X90 Pro+) కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులో లేదు. Vivo X90 సిరీస్ కెమెరాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందుకే, Vivo X90 Pro ఫోన్ పెద్ద 1cm సెన్సార్‌తో వచ్చింది. DSLR లాంటి ఫొటోలను క్లిక్ చేయడంలో యూజర్లకు సాయపడుతుంది.

అద్భుతమైన కెమెరాలతో పాటు Vivo X90 సిరీస్ పవర్‌ఫుల్ ఇంటర్నల్‌ సెట్‌తో వస్తుంది. భారత మొట్టమొదటి Mediatek డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో పాటు 12GB వరకు RAM, 256GB RAMని ఎంచుకుంది. వివో ఇండియా ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వికాస్ టాగ్రా మాట్లాడుతూ.. ‘వివో కొత్త X90 సిరీస్ మా కస్టమర్‌లకు ప్రొఫెషనల్ మొబైల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని అందుబాటులోకి తీసుకొచ్చింది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ X90 సిరీస్‌‌తో స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీలో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లను అందిస్తున్నాం. ZEISS సహకారంతో vivo ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు మరో మైలురాయిని చేరుకున్నాం. వినియోగదారుల కోసం అత్యంత ప్రీమియం మొబైల్ ఇమేజింగ్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు నిరంతరం కొత్త ఫోన్లతో మరింత కృషి చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు.

Read Also : Vivo Foldable X Flip : శాంసంగ్‌కు పోటీగా.. వివో నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

వివో X90 సిరీస్ ధర ఎంతంటే? :
Vivo X90 Pro ఫోన్.. 12GB వేరియంట్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.84,999కి అందుబాటులో ఉంది. మరోవైపు X90, 8GB, 256GB వేరియంట్‌ ధర రూ. 59,999 నుంచి ప్రారంభం అవుతుంది. అదే స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో 12GB వేరియంట్ ధర రూ. 63,999గా ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు మే 5, 2023 నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), (Vivo India), ఇ-స్టోర్ సహా అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు ఈరోజు (ఏప్రిల్ 26) నుంచి స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. SBI, ICICI, HDFC, IDFC బ్యాంకులపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ (Cashback) పొందవచ్చు.

Vivo X90 సిరీస్ స్పెసిఫికేషన్‌లు ఇవే :
వివో X90 మోడల్ ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ స్మూత్‌గా అందిస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీ కెమెరాతో పంచ్ హోల్ కటౌట్ ఉంది. అద్భుతమైన డిస్‌ప్లే HDR10+ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. వివో X90 ప్రో కూడా 2K రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో నాచ్‌ని అందిస్తుంది. 452 PPI, 2160Hz PWM, HDR10+ 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు Immortalis-G715తో MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. వేగవంతమైన, సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వివో X90 సిరీస్ ఫోన్ 12GB LPDDR5 RAM, 256GB UFS 4.0 స్టోరేజ్ వరకు అందిస్తుంది.

Vivo X90 Pro, Vivo X90 launched in India, price starts at 59,999

Vivo X90 Pro, Vivo X90 launched in India, price starts at 59,999

ఈ ఫోన్ అన్ని ఫైల్‌లు, యాప్‌లను స్టోర్ చేసేందుకు తగినంత స్టోరేజీ అందిస్తుంది. వివో X90 వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.75 ఎపర్చరుతో కూడిన 50MP IMX866 ప్రైమరీ సెన్సార్, OIS, EIS, LED ఫ్లాష్, f/2.0 ఎపర్చరు, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 12MP పోర్ట్రెయిట్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ f/2.0 ఎపర్చరుతో వచ్చాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ చేసేందుకు f/2.45తో ముందు భాగంలో 32MP స్నాపర్‌ని కలిగి ఉంది. X90 ప్రో f/1.6 ఎపర్చరు, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో పాటు f/1.75 ఎపర్చరు, OIS, EIS, LED ఫ్లాష్‌తో కూడిన 50MP IMX866 ప్రైమరీ సెన్సార్, f/2.0 ఎపర్చరుతో కూడిన 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలకు ముందు భాగంలో 32MP స్నాపర్ ఉంది.

రెండు ఫోన్‌లు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. వివో X90 ఫోన్ 4,810mAh బ్యాటరీని కలిగి ఉంది. X90 Pro భారీ 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండూ 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉన్నాయి. వివో 5G మోడల్ 4G LTE కనెక్టివిటీ ఆప్షన్లు, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, ఛార్జింగ్, డేటా సింకరైజ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తుంది. సెక్యూరిటీ, స్టీరియో స్పీకర్లు, aptX HD, Hi-Res ఆడియోకు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది.

Read Also : Vivo X90 Sale in India : ఏప్రిల్ 26న వివో X90 సిరీస్ వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?