Vi Self KYC Feature : వోడాఫోన్ ఐడియా యూజర్లకు అలర్ట్.. కొత్త సిమ్ కోసం ఇలా ఇంట్లోనే సెల్ఫ్ కేవైసీ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
Vi Self KYC Feature : వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) యూజర్లకు అలర్ట్. వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ సిమ్ తీసుకునే యూజర్ల కోసం సెల్ఫ్-KYC ప్రక్రియను ప్రారంభించింది.

Vi Self KYC Feature _ Vodafone Idea launches self-KYC for new SIM connection, here is everything you need to know
Vi Self KYC Feature : వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) యూజర్లకు అలర్ట్. వోడాఫోన్ ఐడియా (Vi) కొత్త ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ సిమ్ తీసుకునే యూజర్ల కోసం సెల్ఫ్-KYC ప్రక్రియను ప్రారంభించింది. ఫిజికల్ KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుగానే ఈ KYC ప్రాసెస్ ప్రారంభించవచ్చు. Vi డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) రూపొందించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పుడు కొత్త Vi వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా డోర్‌స్టెప్ డెలివరీ సౌలభ్యంతో కొత్త SIM కనెక్షన్‌ని పొందేందుకు వీలు కల్పిస్తోంది.
డిజిలాకర్‌లో స్టోర్ చేసిన ఆధార్ లేదా ఏదైనా ఇతర అర్హత కలిగిన డాక్యుమెంట్లను ఉపయోగించి వినియోగదారులను ఆటో-వెరిఫికేషన్ ద్వారా వెరిఫై చేసిన తర్వాత KYC ప్రక్రియను ప్రారంభించవచ్చు. కొత్త కనెక్షన్‌ల హోమ్ డెలివరీని ప్రారంభించాలంటూ మొబైల్ ఆపరేటర్‌లను గతంలోనే (DoT) ఆదేశించింది.
Vi సెల్ఫ్ KYC సిస్టమ్ DoT (టెలికమ్యూనికేషన్స్ విభాగం)-నిర్దేశించిన మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. డోర్‌స్టెప్ వద్ద SIM డెలివరీ అదనపు ప్రయోజనంతో కస్టమర్‌లు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా కొత్త కనెక్షన్‌ని యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుందని Vi ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా, సెల్ఫ్ KYC ప్రాసెస్.. కోల్‌కతా, కర్ణాటకలలో ప్రారంభమైంది.
రాబోయే నెలల్లో క్రమంగా పాన్ ఇండియా (Pan India)ను అందుబాటులోకి తేనుంది. ఆ తర్వాత, ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లందరూ ఆన్‌లైన్‌లో కొత్త సిమ్‌ని సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. Vi యూజర్లు తమకు కావలసిన ప్లాన్‌ను ఎంచుకుని, ఇంటివద్దనే సెల్ఫ్-KYC పూర్తి చేయవచ్చు.

Vi Self KYC Feature _ Vodafone Idea launches self-KYC for new SIM connection
Vi కనెక్షన్ కోసం సెల్ఫ్ KYC ఎలా చేయాలంటే? :
* Vodafone Idea కొత్త కనెక్షన్‌ని పొందడానికి సెల్ఫ్-KYCని ప్రారంభించాలి.
* మీరు Vi-myvi.in/ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయాలి.
* ఇప్పుడు కొత్త కనెక్షన్ సెక్షన్‌పై Click చేసి, ప్రక్రియను ప్రారంభించాలి.
* కావలసిన నంబర్‌ని ఎంచుకుని, ఆయా ప్లాన్‌పై Self-KYC ప్రక్రియను పూర్తి చేయండి.
* ఈ ప్రక్రియకు UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆధార్ అథెంటికేషన్ అవసరం.
* అథెంటికేషన్ కోసం మీరు Live ఫొటో, 10 సెకన్ల లైవ్ వీడియోని క్యాప్చర్ చేయాలి.
* డిజిటల్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత, Order చేయండి.
* Vi ద్వారా మీ SIM కార్డ్‌ని జారీ చేస్తుంది.
* అయితే, డెలివరీని పొందాలంటే.. మీరు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు OTPని ఇవ్వడం ద్వారా మీ IDని అథెంటికేషన్ చేయాలి.
కొత్త SIMకు KYC ఎందుకు తప్పనిసరంటే? :
టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్ల ఐడెంటిటీ, అడ్రస్ ధృవీకరించడానికి కొత్త కనెక్షన్ ప్రక్రియలో KYC ప్రక్రియను తప్పనిసరి చేశారు. సర్వీస్ ప్రొవైడర్, కస్టమర్ ఇద్దరికీ సెక్యూరిటీ, భద్రతను కూడా నిర్ధారిస్తుంది. KYC ప్రక్రియ టెలికాం సేవల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సాయపడుతుంది. కస్టమర్ ఐడెంటిటీతో పాటు ఫేక్ ఐడెంటిటీని ఉపయోగించకుండా వీలు లేకుండా ఉంటుంది.
అదనంగా, KYC ఐడెంటిటీ దొంగతనం, మనీలాండరింగ్, తీవ్రవాద ఫైనాన్సింగ్ వంటి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడంలో సాయపడుతుంది. టెలికాం ప్రొవైడర్‌లకు రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా తమ కస్టమర్‌ల కచ్చితమైన రికార్డులను నిర్వహించడానికి కూడా సాయపడుతుంది.