వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది

ప్రముఖ మెసేంజర్ యాప్ సంస్థ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. వాట్సాప్ ప్లాట్ ఫాంపై ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్నో మిలియన్ల మెసేజ్ లు షేర్ అవుతుంటాయి.

  • Published By: sreehari ,Published On : March 18, 2019 / 12:25 PM IST
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది

ప్రముఖ మెసేంజర్ యాప్ సంస్థ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. వాట్సాప్ ప్లాట్ ఫాంపై ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్నో మిలియన్ల మెసేజ్ లు షేర్ అవుతుంటాయి.

ప్రముఖ మెసేంజర్ యాప్ సంస్థ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది. వాట్సాప్ ప్లాట్ ఫాంపై ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్నో మిలియన్ల మెసేజ్ లు షేర్ అవుతుంటాయి. ఫొటోలు, వీడియోలు, మెసేజ్ లు, వెబ్ సైట్ లింక్ లు ఇలా ఎన్నో వాట్సాప్ గ్రూపులు, చాట్ బాక్సుల్లో దర్శనమిస్తుంటాయి. లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు వాట్సాప్ లో మెసేజ్ ల మోత మోగాల్సిందే.. వీటిలో అవసరమైన కంటెంట్ కంటే.. అనవసరమైన కంటెంట్ ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది. ప్రత్యేకించి.. ఫేక్ న్యూస్ కంటెంట్ వేగంగా వైరల్ అవుతోంది. ఏది వాస్తవమో… ఏది ఫేక్ న్యూసో తెలుసుకోలేని పరిస్థితి. కొన్నిసార్లు వాస్తవాన్ని కూడా నమ్మలేం. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ లో స్పెడ్ అయిన పుకార్లు నమ్మి దారుణ ఘటనలు జరిగిన సందర్భాలు అనేకం. ఫేక్ న్యూస్ కు అడ్డకట్టవేసేందుకు వాట్సాప్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

షేరింగ్ లింక్.. సేఫ్ ఆర్ నాట్..
వాట్సాప్.. ప్లాట్ ఫాంపై కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడూ రిలీజ్ చేస్తు వస్తోంది. ఇప్పుడు ఫేక్ న్యూస్  ను కట్టడి చేసేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే..ఇన్ యాప్ బ్రౌజర్  (In App Browser) ద్వారా ఫేక్ న్యూస్, మాలిసియస్‌ సైట్ల విషయంలో ముందుగానే యూజర్లకు ఈ బ్రౌజర్ అలర్ట్ చేస్తుంది. యూజర్ల వాట్సాప్ చాట్ బాక్సులో వచ్చిన లింక్ లు ఏదైనా ఓపెన్ చేయగానే వెంటనే.. ఇన్ యాప్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ అవుతుంది. యూజర్లకు అది ఫేక్ న్యూస్ కంటెంట్ లేదా మాలిసియస్ లింక్ అనేది చెప్పేస్తుంది. ఫేక్ న్యూస్ అయితే ఫేక్ న్యూస్ అని.. మాలిసియస్ కంటెంట్ అయితే.. ఆ పేజీని నాట్ సేప్ టూ విజిట్ అని అలర్ట్ చేస్తుంది. 

టెస్టింగ్ దశలో బ్రౌజర్ ఫీచర్..
ప్రస్తుతం ఇన్ యాప్ బ్రౌజర్ ఫీచర్.. టెస్టింగ్ దశలో ఉన్నట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ రిలీజ్ కు ముందుగా ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.19.74 పై టెస్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో ఏమైనా బగ్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేసి ఫిక్స్ చేసి.. ఫుల్ బగ్ ఫ్రీ వర్షన్ అందించనుంది. ఈ టెస్టింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్న బీటా వర్షన్ యూజర్లను స్ర్కీన్ షాట్, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు అనుమతి లేదు. ఇన్ యాప్ బ్రౌజర్ ఫీచర్ ద్వారా మీరు ఏ వెబ్ సైట్ విజిట్ చేశారో బ్రౌజర్ హిస్టరీ అంతా ఫేస్ బుక్ కు షేర్ అవుతుందని ఆందోళన చెందక్కర్లేదు.

ఆందోళన అక్కర్లేదు..
ఎందుకంటే.. ఆండ్రాయిడ్ API ఆధారంగా ఇన్ యాప్ బ్రౌజర్ పనిచేస్తుంది. దీంతో మీ బ్రౌజర్ హిస్టరీని ఫేస్ బుక్ యాక్సస్ చేసే అవకాశం లేదు. ఈ ఫీచర్ మీ స్మార్ట్ ఫోన్లో సపోర్ట్ చేయాలంటే.. ఆండ్రాయిడ్ 4.1 లేదా అపగ్రేడ్ వర్షన్ అయి ఉండాలి. ఇటీవలే… వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.. వాట్సాప్ రివర్స్ సెర్చ్ ఇమేజ్ ఫీచర్.. ఫేక్ న్యూస్, ఫేక్ ఇమేజ్ ల గుట్టు రట్టు చేసేందుకు వాట్సాప్ ఈ ఫీచర్ ను త్వరలో అందరికి అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం సెర్చ్ ఇమేజ్ ఫీచర్ కూడా టెస్టింగ్ దశలో ఉంది. 
Read Also : 10th, ITI పాసైతే చాలు : HCLలో ఉద్యోగాలు