WhatsApp Multi-Device : వాట్సాప్‌లో ఒకేసారి 4 డివైజ్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు.. ఫోన్ కూడా అక్కర్లేదు!
వాట్సాప్ మెసేంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. లేటెస్ట్‌గా వాట్సాప్ బీటా వెర్షన్ నుంచి ఆకర్షణీయమైన ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది..

Whatsapp Multi Device Beta Allows Four Devices At Once Even Without A Phone
WhatsApp Multi-Device Beta : ప్రముఖ వాట్సాప్ మెసేంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. లేటెస్ట్‌గా వాట్సాప్ బీటా వెర్షన్ నుంచి ఆకర్షణీయమైన ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది.. అదే.. WhatsApp Multi-Device ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ తో ఒకేసారి నాలుగు డివైజ్ లు కనెక్ట్ చేసుకోవచ్చు.
మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి యాక్టివ్‌గా లేకపోయినా కనెక్ట్ అవుతుంది. ఇదంతా end-to-end encryptionతో వర్క్ అవుతుంది. ఇప్పటివరకూ వాట్సాప్ లో ఏదైనా డివైజ్ కనెక్ట్ చేయాలంటే.. డెస్క్ టాప్ పై Whatsapp Web ద్వారా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి కచ్చితంగా ఫోన్ అవసరం ఉండాలి. కానీ, ఈ కొత్త Beta వెర్షన్ వాట్సాప్ కు మాత్రం ఫోన్ కూడా అక్కర్లేదు..
We’ve been working on this for a long time. Until now, @WhatsApp has only been available on one device at a time. And desktop and web support only worked by mirroring off your phone – which meant your phone had to be on and have an active internet connection.
— Will Cathcart (@wcathcart) July 14, 2021
ఒకే సమయంలో Multiple Devices కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. నాలుగు డివైజ్ ల వరకు కనెక్ట్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. వాట్సాప్ బీటా ప్రొగ్రామ్ లో భాగంగా టెస్టింగ్ కోసం లిమిటెడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.