Whatsapp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. చాట్ స్ర్కోల్ చేస్తూ వాయిస్ మెసేజ్ వినొచ్చు..!

ప్రముఖ మెటా సొంత యాప్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. 2022 కొత్త ఏడాదిలో మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది.

Whatsapp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. చాట్ స్ర్కోల్ చేస్తూ వాయిస్ మెసేజ్ వినొచ్చు..!

Whatsapp Rolling Out New Global Voice Note Player On Ios Beta

Updated On : January 14, 2022 / 4:12 PM IST

Whatsapp : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Facebook) సొంత యాప్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. 2022 కొత్త ఏడాదిలో మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్.. (Global Voice Note Player) ఫీచర్.. మీ చాట్ బాక్సులో వేర్వేరు చాట్ స్ర్కోల్ చేస్తూనే వాయిస్ మెసేజ్ వినొచ్చు. ఏదైనా చాట్‌లో వాయిస్ మెసేజ్ ఉంటే.. ఆ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత అలానే ప్లే అవుతుంది. మీరు మరో చాట్ ఓపెన్ చేసినప్పటికీ వాయిస్ నోట్ ప్లేయర్ ప్లే అవుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ఆ చాట్ లో మాత్రమే ఓపెన్ చేసి వినాల్సి ఉంటుంది. మరో చాట్ ఓపెన్ చేయాలంటే ఈ వాయిస్ మెసేజ్ ప్లే ఆగిపోతుంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది. WABetainfo ప్రకారం.. మరో చాట్ ఓపెన్ చేసినా లేదా బ్యాక్ వెళ్లినా వాయిస్ మెసేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఈ గ్లోబల్ వాయిస్ నోట్ ఫీచర్.. కొన్ని iOS బీటా టెస్టర్ల కోసం రిలీజ్ చేసింది వాట్సాప్. అందులో వాట్సాఫ్ బిజినెస్ బీటా యూజర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ గ్లోబల్ వాయిస్ నోట్ ప్లేయర్.. ఆండ్రాయిడ్ Whatsapp beta పై డెవలప్ మెంట్ స్టేజ్‌లో ఉంది.. ఎప్పుడు ఈ ఫీచర్ అధికారికంగా రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.

మరో నివేదికలో.. వాట్సాప్ రాబోయే ఫ్యూచర్ అప్‌డేట్‌లో iOS డివైజ్‌లపై Boradcast Lists New Group ఆప్షన్లను చాట్ లిస్టు నుంచి ఎత్తేసేందుకు ప్లాన్ చేస్తోంది. వాట్సాప్ యూజర్ల కాంటాక్టు లిస్టులో Broadcast అనే న్యూ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దానిపై యూజర్ Tap చేయగానే టాప్ రైట్ సైడ్‌లో Start New Chat అనే బటన్ కనిపిస్తుంది. ఈ ఫ్యూచర్ అప్‌డేట్ ప్లానింగ్ పై నివేదికలు వచ్చినప్పటికీ.. ఎప్పుడు ఫీచర్ రిలీజ్ అవుతుందనేది కచ్చితంగా తెలియదు.

Read Also : WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. మీ చాట్ బాక్సు ఫిల్టర్ చేసేస్తుంది..!