Travelling Flight : విమానాల్లో ప్రయాణించేవారు ఈ 5 గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.. ఎందుకో తెలసా? కారణాలివే!

Travelling Flight : విమానాశ్రయాలు భద్రతపరంగా గాడ్జెట్‌లపై కఠినమైన నిబంధనలను విధిస్తాయి. హైకెపాసిటీ పవర్ బ్యాంక్‌లు, లేజర్ డివైజ్ వంటి నిషేధిత వస్తువులను నివారించండి. విమాన ప్రయాణాల్లో నివారించాల్సిన 5 గాడ్జెట్ల గురించి తెలుసుకుందాం.

Travelling Flight : విమానాల్లో ప్రయాణించేవారు ఈ 5 గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.. ఎందుకో తెలసా? కారణాలివే!

Why you should avoid carrying these 5 gadgets when travelling by flight

Travelling Flight : ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా విమానాశ్రయ ప్రదేశాల్లో గాడ్జెట్‌ల వాడకంపై అనేక పరిమితులు ఉంటాయి. విమాన ప్రయాణాల్లో కొన్ని డివైజ్‌లు ఎంత విలువైనవి అయినా భద్రతపరంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తాయి.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 14వేల ఫ్లాట్ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ఈ డీల్ ఎలా పొందాలంటే?

అందుకే, ఇలాంటి విమాన ప్రయాణాల్లో ఎలాంటి గాడ్జెట్లను తీసుకెళ్లకూడదు? వేటిని తీసుకువెళ్లొచ్చు అనేదానిపై చాలామందికి అవగాహన ఉండదు. మీరు కూడా మొదటిసారి విమానం ఎక్కబోతున్నారా? అయితే, కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవడం ఎంతైనా మంచిది. మీరు విమానాశ్రయానికి తీసుకురాకుండా ఉండవలసిన 5 గాడ్జెట్‌ల వివరాలతో పాటు అందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హై కెపాసిటీ పవర్ బ్యాంకులు :
ప్రయాణంలో పవర్ డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, అన్ని పవర్ బ్యాంక్‌లు విమాన ప్రయాణానికి తగినవి కావు. విమానాలలో అనుమతించే పవర్ బ్యాంకుల సామర్థ్యానికి సంబంధించి విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు కఠినమైన నిబంధనలు విధించాయి.

పవర్ బ్యాంక్‌లలో సాధారణంగా కనిపించే లిథియం-అయాన్ బ్యాటరీలు పాడైపోయినా లేదా షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. 20,00ఎంఎహెచ్ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌లు క్యారీ-ఆన్, చెక్డ్ లగేజీ రెండింటిలోనూ నిషేధించారు. హై కెపాసిటీ గల పవర్ బ్యాంక్‌లను ఇంట్లో ఉంచడమే మంచిది. చిన్నవి, ఎయిర్‌లైన్ ఆమోదించిన వాటినే వినియోగించాలి.

పోర్టబుల్ వై-ఫై హాట్‌స్పాట్‌లు :
పోర్టబుల్ వై-ఫై హాట్‌స్పాట్‌లు ప్రయాణ సమయంలో కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ, విమానాశ్రయం వైర్‌లెస్ నెట్‌వర్క్, నావిగేషన్ సిస్టమ్‌లకు అంతరాయం కలిగేలా చేయొచ్చు. అనేక విమానాశ్రయాలు తమ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అంతరాయాలను నివారించడానికి పర్సనల్ వై-ఫై హాట్‌స్పాట్‌లను ఉపయోగించడాన్ని నిషేధించాయి. పోర్టబుల్ హాట్‌స్పాట్‌పై ఆధారపడే బదులుగా అవసరమైతే విమానాశ్రయంలో ఉచిత వై-ఫై లేదా మీ మొబైల్ డివైజ్ డేటా కనెక్షన్‌ని ఉపయోగించవచ్చు.

రిమోట్-కంట్రోల్ బొమ్మలు, డ్రోన్లు :
డ్రోన్లు, ఆర్‌సీ కార్లు వంటి రిమోట్-కంట్రోల్ బొమ్మలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ డివైజ్‌లను విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. ప్రయాణీకులు, సిబ్బందికి భద్రతపరంగా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పటికే, అనేక దేశాలు డ్రోన్‌ల వినియోగంపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. సరైన అనుమతి లేకుండా విమానాశ్రయానికి తీసుకురావడం చట్టపరంగా నేరం. మీ రిమోట్-కంట్రోల్ బొమ్మలను ఇంట్లోనే ఉంచేయడం బెటర్.

లేజర్ పాయింటర్లు, పెన్నులు :
విమాన ప్రయాణాల్లో లేజర్ పాయింటర్లు, పెన్నులు ప్రమాదకరం కావొచ్చు.. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారొచ్చు. ఈ డివైజ్‌లు పైలట్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లు, ఇతర విమానాశ్రయ సిబ్బందిని తాత్కాలికంగా డైవర్ట్ చేస్తాయి. భద్రతపరమైన సమస్యలకు దారితీస్తుంది. అనేక విమానాశ్రయాలలో లేజర్ డివైజ్‌లను విమానం వద్ద లేదా విమానాశ్రయాల్లో వాడటం చట్టవిరుద్ధం. లేదంటే.. చట్టపరమైన సమస్యలతోపాటు ఇతరుల భద్రత పరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే, మీ సామాగ్రి నుంచి లేజర్ పాయింటర్లు, పెన్నులను పూర్తిగా దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది.

ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వాపింగ్ డివైజ్‌లు :
ప్రస్తుత రోజుల్లో స్మోకింగ్ చేసే విధానంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వాపింగ్ డివైజ్‌లు ప్రత్యేకంగా మారాయి. విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు కూడా ఈ స్మోకింగ్ డివైజ్‌లకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. చాలా సందర్భాలలో.. ఇ-సిగరెట్లు, వాపింగ్ డివైజ్‌లు క్యారీ-ఆన్ లగేజీలో మాత్రమే అనుమతిస్తారు. దాంతో విమానంలో ఉపయోగించలేరు లేదా ఛార్జ్ చేయడం కుదరదు.

ప్రత్యేకించి డివైజ్ బ్యాటరీలు దెబ్బతిన్నట్లయితే లేదా తీవ్రంగా వేడిక్కినా ఈ డివైజ్‌లలోని లిథియం-అయాన్ బ్యాటరీలు పేలుడుకు దారితీస్తాయి. విమానాశ్రయ నిబంధనలకు లోబడి ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజ్‌లను ఇంట్లోనే వదిలివేయడం లేదా వాటిని మీ క్యారీ-ఆన్ బ్యాగ్‌లో సురక్షితంగా ప్యాక్ చేయడం ఉత్తమం. ఈ గాడ్జెట్‌లను వెంట తీసుకెళ్లడం కన్నా ఇంట్లోనే ఉంచడం లేదా విమానాశ్రయ నిబంధనలను పాటించడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.

Read Also : Xiaomi 14 Smartphone : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో షావోమీ 14 స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ. 30,899 మాత్రమే..!