YouTube Create App : భారతీయ యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్.. ఈ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు!

YouTube Create App : మీరు యూట్యూబ్ క్రియేటర్లు అయితే మీకో గుడ్ న్యూస్.. భారతీయ యూజర్ల కోసం యూట్యూబ్ కొత్త వీడియో క్రియేట్ యాప్ తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందంటే?

YouTube Create App : భారతీయ యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌ న్యూస్.. ఈ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు!

YouTube Create app now available in India, lets you edit videos on mobile

YouTube Create App : భారతీయ యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. భారత్‌లో ఎట్టకేలకు యూట్యూబ్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ (YouTube Create App)ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి గత ఏడాదిలోనే ఈ ప్రీ యూట్యూబ్ క్రియేట్ యాప్ ప్రకటించగా.. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రీ-ఛార్జ్ యూట్యూబ్ యాప్ ద్వారా ఆసక్తిగల వినియోగదారులు షార్ట్‌లు చేసుకోవచ్చు. లేదంటే.. లాంగ్-ఫారమ్ కంటెంట్ రెండింటికీ వీడియో ఎడిటింగ్‌ను చేసుకోవచ్చు.

వినియోగదారులు తమ క్రియేటివిటీకి మరింత పదును పెట్టేందుకు స్టోరీ ఆధారిత వీడియోలను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇప్పుడు భారత్ సహా 13 దేశాలలో అందుబాటులో ఉండగా.. అందులో ప్రధానంగా ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో బీటా మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : YouTube: యూట్యూబర్లకు పెద్ద న్యూస్.. ఇకపై అలాంటి న్యూడ్ కంటెంట్‭కు కూడా డబ్బులు వస్తాయి

యూట్యూబ్ ప్రకారం.. ఇప్పటివరకూ ఉన్న యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనేది చాలామందికి కష్టంగా ఉందనే చెప్పాలి. ఎక్కువ సమయం తీసుకోవడమే కాదు.. ఖరీదైన ప్రక్రియ కూడా. అయితే, ఈ కొత్త యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఆ సమస్యకు చెక్ పడినట్టే. ఎడిటింగ్ అనేది ప్రతిఒక్క వినియోగదారుడికి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, అనేక ఫీచర్లను అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త, ఇప్పటికే ఉన్న యూట్యూబ్ క్రియేటర్లకు వీడియో క్రియేషన్ మరింత సులభతరం అవుతుంది. ఈ కొత్త యాప్ ప్రారంభించిన తర్వాత గత కొన్ని నెలల్లోనే గ్లోబల్ క్రియేటర్ కమ్యూనిటీ నుంచి అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ అందుకుంది. అవసరమైన ఫీచర్లను కూడా చేర్చింది. మీరు కూడా మీ వీడియోలను ఎడిట్ చేసేందుకు యూట్యూబ్ క్రియేట్‌ని ఎలా ఉపయోగించవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫుటేజీని రికార్డ్ చేయండి : యూట్యూబ్ క్రియేట్ యాప్‌లో ఎడిట్ చేసే క్లిప్‌లను రికార్డ్ చేసేందుకు మీ ఫోన్‌ని ఉపయోగించండి. మీరు కాఫీ షాప్‌ కోసం చూస్తున్నా లేదా మీ ఫాలోవర్లతో షేర్ చేయాలనుకునే మరేదైనా విషయానికి సంబంధించిన ఫుటేజీని క్యాప్చర్ చేయండి.

మ్యూజిక్ ఎంచుకోండి : మీ వీడియోకు సరైన సౌండ్‌ట్రాక్‌ కోసం సెర్చ్ చేయండి. అందుకు యాప్‌లో అందుబాటులో ఉన్న వేలాది పాటలను బ్రౌజ్ చేయండి. మూడ్‌ని సెట్ చేసేలా విజువల్స్‌ తగినట్టుగా ఉండే పాటను ఎంచుకోండి. యూట్యూబ్ క్రియేట్ మ్యూజిక్ లైబ్రరీలో రాయల్టీ ప్రీగా ఉంటాయి. మీరు కాపీరైట్ క్లెయిమ్‌ల గురించి ఆందోళన అవసరం లేదు. యూట్యూబ్‌లో మీ సొంత క్రియేటివిటీతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చునని యూట్యూబ్ పేర్కొంది.

మ్యాచ్ బీట్స్ : మీ వీడియో ట్రాన్సాషన్లను మ్యూజిక్‌తో సింకరైజ్ చేసేందుకు బీట్ మ్యాచింగ్ ఫీచర్‌ని ఉపయోగించండి. మ్యూజిక్‌లో ఆకర్షణీయమైన బీట్‌లను గుర్తించడానికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. టైమ్‌లైన్‌లో గుర్తించడానికి ‘Find Beats’ ఆప్షన్ ట్యాప్ చేయండి. మీ వీడియో ఎడిటింగ్స్ ద్వారా మ్యూజిక్ తగినట్టుగా వీడియో సింక్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లను యాడ్ చేయండి : మీ వీడియో క్వాలిటీని మరింత మెరుగుపరచడానికి స్టిక్కర్‌లు, జిఫ్, ఎఫెక్ట్‌, ఫిల్టర్‌ల లైబ్రరీని ఉపయోగించండి. మీ వీడియోను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేకంగా ఫిల్టర్ల సాయంతో కొత్తగా క్రియేట్ చేయొచ్చు.

ఆడియో క్లీనప్ : మీ వీడియో ఫుటేజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తొలగించడానికి ఆడియో క్లీనప్ టూల్ ఉపయోగించండి. ఈ టూల్ సాయంతో మీ వాయిస్ స్పష్టంగా, సులభంగా వినిపించేలా చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఈ టూల్‌పై ఒకసారి ట్యాప్ చేస్తే చాలు.. వీడియో ప్లే అయ్యే సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే అనవసరమైన శబ్దాలను సులభంగా తొలగించవచ్చు.

వాయిస్ ఓవర్ క్యాప్షన్లు : మీ వీడియోలో స్టోరీ గురించి వివరించేందుకు వాయిస్‌ఓవర్‌ని అందించవచ్చు. అంతేకాదు.. క్యాప్షన్లను ఎడిట్ చేసేందుకు వీలుగా ఆటో క్యాప్షనింగ్ ఫీచర్ ఉపయోగించండి. టెక్స్ట్ ఫార్మాట్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసేందుకు వివిధ స్టైలింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోండి.

యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి : మీ వీడియో ఎడిట్ చేసిన తర్వాత యూట్యూబ్ క్రియేట్ యాప్ నుంచి నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి.

Read Also : Lava Blaze Curve 5G : కర్వ్డ్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ 17,999 మాత్రమే!