YouTube Vanced : యాడ్స్ ఫ్రీ యూట్యూబ్ కంటెంట్ ఇకపై చూడలేరు.. ఆ యాప్ రద్దు!
ఆన్ లైన్ వీడియోలు అనగానే అందరికి టక్కున గుర్తొచ్చేది యూట్యూబ్.. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో వీడియో కంటెంట్ కు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

Youtube Vanced To Be Shut Down Because Of Legal Reasons, Current Version Still Working (1)
YouTube Vanced : ఆన్ లైన్ వీడియోలు అనగానే అందరికి టక్కున గుర్తొచ్చేది యూట్యూబ్.. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో వీడియో కంటెంట్ కు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. అయితే యూట్యూబ్‌లో వీడియోలను చూస్తున్న సమయంలో మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ఇలా యాడ్స్ వచ్చినప్పుడు చూసే యూజర్‌కు చాలా చిరాకు అనిపిస్తుంటుంది. అందుకే చాలామంది యూట్యూబ్ యూజర్లు ఈ Vanced అనే యాప్ వినియోగిస్తుంటారు. ఈ యాప్ మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు..
ఆ తర్వాత యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ చేసి ఎలాంటి యాడ్స్ లేకుండా ఈజీగా చూసేయొచ్చు. ఈ యాప్ సాయంతో ఆ యాడ్స్ బ్లాక్ చేయొచ్చు. యాడ్స్ లేకుండా యూట్యూబ్ ప్రీమియం పెయిడ్ సర్వీసులు కూడా అందిస్తోంది. ఎలాంటి పేమెంట్ చేయకుండా పెయిడ్ సర్వీస్ యాడ్స్ ఫ్రీగా యూట్యూబ్ చూసే అవకాశం వాన్సెడ్ యాప్‌తో ఉండేంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభించి ఈ యాప్‌ను ఉపయోగించి యాడ్ ఫ్రీగా యూట్యూబ్ వీడియోలు చూసేందుకు వీలుంది. ఈ యాడ్ ఫ్రీగా కంటెంట్ చూపిస్తున్న వాన్సెడ్ యాప్ కు లీగల్ ఇష్యూ వచ్చాయి. తమ వీడియో కంటెంట్‌పై వాన్సెడ్ యాప్ డామినేషన్ ఏంటి అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
దాంతో వాన్సెడ్ యాప్ క్రియేటర్ వెర్జ్ కంపెనీ తమ యాప్ వెనక్కి తీసుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకూ డౌన్‌లోడ్ చేసుకున్న డేటా కూడా త్వరలోనే బంద్ అవుతాయంటూ వెర్జ్ అంటోంది. వాన్సెడ్ యాప్ రద్దు కావడంతో ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై యూట్యూబ్ చేసే యూజర్లు యాడ్స్ ఫ్రీ కంటెంట్ చూడటం కుదరదు. గతంలో యూట్యూబ్ వీడియోల కోసం ప్రత్యేకించి అందుబాటులో ఉన్న యాప్.. Tubemate కూడా బ్యాన్ అయింది.
Read Also : YouTube Channels: 35 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన మోదీ ప్రభుత్వం