Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?

కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి అధికార బీఆర్ఎస్ మునుగోడు ఫార్మలాను అవలంభిస్తోందా? అంటే అవునంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది....

Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?

BRS Munugodu formula

Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి అధికార బీఆర్ఎస్ మునుగోడు ఫార్మలాను అవలంభిస్తోందా? అంటే అవునంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార బీఆర్ఎస్ గత మునుగోడు ఉప ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములాను ఈ సారి సాధారణ ఎన్నికల్లోనూ అవలంభించాలని యోచిస్తోంది.

బీఆర్ఎస్ పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహం

కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆ పార్టీ అభ్యర్థులను అధికార, పోలీసు బలంతో క్షేత్రస్థాయిలో కట్టడి చేయాలని బీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. కాంగ్రెస్ అభ్యర్థులను అష్టదిగ్బంధనం చేసేందుకు అధికార పార్టీ వినూత్న వ్యూహాన్ని రూపొందించింది. ప్రచారం ముగియగానే చివరి పోలింగ్ పర్వంలో రెడు రోజుల పాటు పకడ్బందీ కార్యాచరణ చేపట్టనుంది. కాంగ్రెస్ అభ్యర్థులను అధికారులు, పోలీసుల ద్వారా కట్టడి చేసి పోల్ మేనేజ్ మెంట్ చేయడం ద్వారా తాము విజయం సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ముమ్మర సోదాలతో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యం జరగడంతో వారు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో ఆటంకం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రచారానికి, పోల్ మేనేజ్ మెంటుకు ఫైనాన్షియర్ల నుంచి నిధులు అందకుండా పోలీసుల ద్వారా అష్టదిగ్భంధనం చేసింది. ఎన్నికల షెడ్యూల్ ఖరారుకు ముందే నిధులను సమకూర్చుకొని ప్రచార పర్వంలోనూ ముందున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు మునుగోడు ఫార్ములాను అవలంభిస్తోంది.

BRS

BRS

పోలింగ్ పర్వంలోనూ నిఘా వ్యూహం

పోలీసుల ముమ్మర సోదాలు, ఆదాయపు పన్నుశాఖ అధికారుల వరుస దాడులతో కాంగ్రెస్ అభ్యర్థులను కట్టడి చేసింది. పోలింగ్ పర్వంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు అందకుండా చేస్తే బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థుల కదలికలపై నిఘా వేసి వారు పోల్ మేనేజ్ మెంటులో భాగంగా డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవాలని నిర్ణయించారు.

ALSO READ : Nalgonda : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?

దీనికోసం చివరి రెండురోజుల పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దేశంలోనే అత్యధికంగా డబ్బు, మద్యాన్ని తెలంగాణలోనే స్వాధీనం చేసుకున్నారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ 21 దర్యాప్తు సంస్థలతో నిఘా పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాయంతో డిజిటల్ లావాదేవీలపై కడా ఈసీ డేగకన్ను వేసింది. దీంతో ఓటర్లకు బహుమతుల పంపిణీ, నగదు, మద్యం పంపిణీ జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.

ALSO READ : Revanth Reddy : ఎంఐఎంను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించండి.. వారిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దే

ఈసీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. వీరి ద్వారా కాంగ్రెస్ అభ్యర్థులను కట్టడి చేసి ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నింది. గత మునుగోడు ఉప ఎన్నికల్లో పన్నిన ఫార్ములా సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ సారి తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఫార్ములా అమలుతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ అగ్రనేతలు నిర్ణయించారు. బీఆర్ఎస్ షెడ్యూల్ విడుదలకు ముందే నిధులను ఎక్కడికక్కడ డంప్ చేసి ఉంచుకుంది.

ALSO READ : Australian Deputy PM : ఢిల్లీ వీధుల్లో నింబూపానీ తాగిన రిచర్డ్ మార్లెస్…వీడియో వైరల్

దీంతో బీఆర్ఎస్ ప్రచారానికి నిధుల కొరత లేకుండా పోయింది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తోడ్పాటుతో బీఆర్ఎస్ కాంగ్రెస్ దూకుడుకు తెర వేయాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మునుగోడు ఫార్ములా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎంత వరకు ఓట్లు సాధించిపెడుతుందో డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు పర్వం దాకా వేచి చూడాల్సిందే.