Revanth Reddy : ఎంఐఎంను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించండి.. వారిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దే

20ఏళ్లుగా ఎంఐఎం మాటలువిని ఆ పార్టీని గెలిపించి మోసపోయారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పే అసదుద్దీన్.. ఇక్కడి పేదలను ఎందుకు ఆదుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Revanth Reddy : ఎంఐఎంను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించండి.. వారిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దే

Revanth Reddy

Updated On : November 20, 2023 / 9:50 PM IST

Telangana Elections 2023 : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గుడిమల్కాపూర్ నాంపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోజగుట్ట, శ్రీరామ్ నగర్, శివాజీ నగర్ బస్తీ పేదలను ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

Also Read : Nalgonda : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?

20ఏళ్లుగా ఎంఐఎం మాటలువిని ఆ పార్టీని గెలిపించి మోసపోయారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పే అసదుద్దీన్.. ఇక్కడి పేదలను ఎందుకు ఆదుకోలేదు? పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇప్పించలేదు? శాస్త్రీపురం గుట్టపై కోట నిర్మించుకున్నాడుకానీ బోజగుట్ట పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : KTR : పెన్షన్ రూ.5వేలకు పెంపు, కొత్త రేషన్ కార్డులు- మంత్రి కేటీఆర్ వరాలు

పీజేఆర్ లా ఫిరోజ్ ఖాన్ మీ పక్షాన నిలబడతాడు.. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని స్థానిక ప్రజలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే.. బస్తీల్లో ఒక్కఓటు కూడా చీలనివ్వొద్దని ఓటర్లకు రేవంత్ సూచించారు. నాంపల్లిలో ఎంఐఎంను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.