Corona Vaccine : తెలంగాణలో రోజుకు 1.50 లక్షల మందికి వ్యాక్సిన్

తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్‌ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారు.

Corona Vaccine : తెలంగాణలో రోజుకు 1.50 లక్షల మందికి వ్యాక్సిన్

Corona Vaccine

Updated On : April 20, 2021 / 1:58 PM IST

1.50 lakh people vaccinated daily in Telangana : కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. కేంద్రం వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతుడటంతో వ్యాక్సిన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. వ్యాక్సినేషన్ కోసం జనం భారీగా బారులు తీరుతున్నారు.

తెలంగాణలో ఈ ఏడాది జనవరి 1నాటికి 18 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 2.62 కోట్లుగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్‌ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణలో వ్యాక్సినేషన్‌ పూర్తవ్వడానికి ఏడాది సమయం పడుతోందని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉంటే కేవలం నెల రోజుల్లో వ్యాక్సిన్‌ వేయవచ్చంటున్నారు.